Vande Bharat Train Attack : వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై మరోసారి రాళ్ల దాడి

దేశంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై తరచుగా రాళ్ల దాడులు జరుగుతున్నాయి. సికింద్రాబాద్-విశాఖ మధ్య నడుస్తోన్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై మరోసారి రాళ్ల దాడి జరిగింది.

Vande Bharat Train Attack : వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై మరోసారి రాళ్ల దాడి

Vande Bharat train (1)

Updated On : February 10, 2023 / 11:35 PM IST

Vande Bharat Train Attack : దేశంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై తరచుగా రాళ్ల దాడులు జరుగుతున్నాయి. సికింద్రాబాద్-విశాఖ మధ్య నడుస్తోన్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై మరోసారి రాళ్ల దాడి జరిగింది. మహబూబాబాద్-గార్ల రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు రైలుపై రాళ్లు విసిరారు. దీంతో నాలుగో నెంబర్ కోచ్ అద్దాలు పగిలాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్తోన్న సమయంలో రైలుపై దాడి జరిగింది.

కోచ్ అద్దాలు పగిలిపోయాయని.. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరుగలేదని రైల్వే అధికారులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. జవనరి 3న ఖమ్మం జిల్లాలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులను పోలీసులు గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Stone Pelting Vande Bharat Train : విశాఖలో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి

అంతకముందు జనవరిలో రైలు ప్రారంభానికి ముందే వందే భారత్ రైలుపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ట్రయల్ రన్ లో భాగంగా విశాఖకు వచ్చిన వందే భారత్ ట్రైన్ బోగీలపై కంచరపాలెంలో రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడిలో రెండు కోచ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. రామ్మూర్తి పంతులు పేట గేట్ వద్ద ఆడుకుంటున్న ఆకతాయిలు రైలుపై రాళ్లు విసిరినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు.