Home » Author »Narender Thiru
అండమాన్ దీవుల్లోని కొన్ని దీవులకు ఈ రోజు పేర్లు పెట్టబోతున్నారు. అండమాన్-నికోబార్ దీవుల్లోని 21 దీవులకు 21 మంది ‘పరమవీర చక్ర’ అవార్డు గ్రహీతల పేర్టు పెట్టనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
రోడ్డుపై ఉన్న గుంతలో పడి తన తాతకు గాయాలైతే.. ఇంకెవరికీ అలా గాయాలు కాకూడదని ఆ గుంతను పూడ్చేశాడో మనవడు. అలాగని ఆ మనవడి వయసు ఎక్కువేమీ కాదు. పదమూడేళ్లే. చదువుతోంది ఎనిమిదో తరగతే.
సోమవారం నుంచి కరీంనగర్లో శ్రీవారి షష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 11 రోజులపాటు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వీటికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి గంగుల కమలాకర్ పర్యవేక్షిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ఆధ్
తాజాగా చత్తీస్‌గఢ్, దర్గ్ ప్రాంతంలో ఒక బైకుపై జంట అభ్యంతరకరంగా ప్రవర్తించింది. ఒక వ్యక్తి బైకు నడుపుతూ ఉండగా, అమ్మాయి అదే బైకుపై ఎదురుగా కూర్చుంది. దీంతో ఇద్దరూ విచ్చలవిడిగా ప్రవర్తించారు. అది కూడా బైకు రైడ్ చేస్తూ తప్పుగా ప్రవర్తించారు.
అందరూ ఒకే చోట గుమిగూడి వేడుకలు జరుపుకొంటుండగా, ఒక దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం గన్ మెషీన్ చేత బట్టిన ఒక వ్యక్తి అక్కడివారిపై కాల్పులు జరిపాడు. గన్ మెషీన్ వరుసగా లోడ్ చేస్తూ కాల్పలుకు తెగబడ్డాడు.
న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో షూటౌట్లో భారత జట్టు పరాజయం పాలైంది. క్రాస్ ఓవర్ మ్యాచ్‌లో 4-5 తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. పురుషుల హాకీ వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్న భారత జట్టు అంచనాలు అందుకోవడంలో విఫలమైంది.
రోడ్ల మరమ్మతులు చేపట్టేందుకు నాగబాబు ఆదివారం అనంతపురం పట్టణంలో పర్యటించారు. అక్కడి కలెక్టరేట్ నుంచి చెరువుకుట్ట మీదుగా బుక్కరాయ సముద్రం వెళ్లే దారి అధ్వానంగా ఉండటంతో ఆ రోడ్డును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాగబాబు, జనసేన కార్యకర్తలు పాల�
జోషిమఠ్‌లోని 863 బిల్డింగులలో పగుళ్లు వచ్చినట్లు డీఎమ్ తేల్చారు. వీటిలో 181 ఇళ్లు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని, ఇవి నివాసయోగ్యం కావని అధికారులు గుర్తించారు. దీంతో ప్రమాదకరంగా ఉన్న ఇండ్లను కూల్చివేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటికి ఒక్కరికి సంబంధించిన ఎముకలు, ఇతర అవశేషాలు మాత్రమే దొరికిన సంగతి తెలిసిందే. వీటిని క్లూస్ టీమ్ సేకరించి, డీఎన్ఏ టెస్టు కోసం పంపింది. ఈ ఘటనలో కనిపించకుండా పోయిన మిగతా ఇద్దరికి సంబంధించి ఇంకా ఎలాంటి ఆచూకీ లభించలేదు.
ప్రభుత్వ పాఠశాలలో మంజునాథ్ (43) టీచర్‌గా పని చేస్తున్నాడు. అయితే, అతడు ఆ స్కూల్లో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని విద్యార్థినులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లు ఈ అంశంపై పోలీసులకు, విద్యాశాఖ అధికారులకు
వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా 2024లో ‘వోట్ ఆన్ బడ్జెట్’ సమావేశాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో తాజా సమావేశాల కోసం ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ నెల 29న కేంద్ర క్యాబినెట్ భేటీ అవుతుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులందరూ హాజరవుతారు.
హకీంపేటలో ఆదివారం సిలిండర్లు పేలి మంటలు అంటుకున్నాయి. హకీంపేటలో సాలార్జంగ్ బ్రిడ్జి ఏరియాలో వెల్డింగ్ వర్క్ జరుగుతోంది. ఈ పనులు జరుగుతుండగా వెల్డింగ్ షాపునకు చెందిన 5 సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి.
ఆదివారం ఉదయం లాస్ ఏంజెల్స్ కౌంటీలోని, మానెటరీ పార్కు వద్ద చైనా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. అందరూ ఒకే చోట గుమిగూడి ఉన్న సమయంలో గన్ మెషీన్ చేత బట్టుకున్న ఒక దుండగుడు, అక్కడి వాళ్లపై కాల్పులకు తెగబడ్�
వృద్ధుడిని ఢీకొన్న కారు అతడిని అలాగే ఎనిమిది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో వృద్ధుడు కారు కింద పడి మరణించాడు. ఈ ఘటన తూర్పు చంపారన్ జిల్లాలో, 27వ నెంబర్ జాతీయ రహదారిపై జరిగింది.
ఘజియాబాద్‌కు చెందిన మీలాల్ ప్రజాపతి అనే వ్యక్తి భార్య, స్థానికంగా ఉండే అక్షయ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఇది గుర్తించిన ప్రజాపతి తన భార్యతో సంబంధం పెట్టుకున్న అక్షయ్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు. అయితే, వాళ్ల వివాహేతర స
ఈ విచారణకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 3,000 పేజీల ఛార్జిషీటు సిద్ధం చేశారు. ఛార్జిషీటులో కీలక విషయాల్ని పొందు పరిచారు. విచారణలో భాగంగా దాదాపు 100 మంది సాక్షుల వాంగ్మూలం తీసుకున్నట్లు ప్రస్తావించారు. అలాగే ఫోరెన్సిక్ నివేదిక, ఎలక్ట్రానిక్, సైంటిఫ
గతంలో కాలేజ్ హాస్టల్లో మాంసం వడ్డించే వాళ్లు. అయితే, ఇటీవల మాంసంపై నిషేధం యాజమాన్యం విధించింది. విద్యార్థులకు శాకాహారం మాత్రమే అందిస్తామని చెప్పింది. అలాగే బయట నుంచి మాంసాహారం తెచ్చుకున్నా అనుమతించడం లేదు.
ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబ సభ్యులతోపాటు అనిల్ అంబానీ దంపతులు, పలువురు బాలీవుడ్ తారలు హాజరయ్యారు. గుజరాత్ సంప్రదాయ పద్ధతిలో నిశ్చితార్థ వేడుక జరిగింది. కార్యక్రమం అనంతరం పలు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు నిర్వహించారు.
దాదాపు ఏడాది తర్వాత కోమటిరెడ్డి గాంధీ భవన్‌కు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. ఆయన తరచూ వ్యతిరేకించే రేవంత్ రెడ్డితో కూడా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
గూగుల్‌తోపాటు తమ ఇతర అనుబంధ సంస్థల్లో మొత్తం 12,000 మంది ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్లు గూగుల్ మాతృసంస్థ ‘ఆల్ఫాబెట్’ ప్రకటించింది. కనీసం 6 శాతం ఉద్యోగుల్ని తొలగించాలనుకుంటున్నట్లు తెలిపింది.