California Shooting: క్యాలిఫోర్నియా కాల్పుల నిందితుడు ఆత్మహత్య.. పోలీసులు చుట్టుముట్టడంతో గన్‌తో కాల్చుకుని మృతి
అందరూ ఒకే చోట గుమిగూడి వేడుకలు జరుపుకొంటుండగా, ఒక దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం గన్ మెషీన్ చేత బట్టిన ఒక వ్యక్తి అక్కడివారిపై కాల్పులు జరిపాడు. గన్ మెషీన్ వరుసగా లోడ్ చేస్తూ కాల్పలుకు తెగబడ్డాడు.

California Shooting: అమెరికాలోని క్యాలిఫోర్నియాలో ఆదివారం జరిగిన కాల్పుల ఘటనలో నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. క్యాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్‌లోని మాంటెరీ పార్కులో ఆదివారం చైనా కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు వేలాది మంది హాజరయ్యారు.
Hockey World Cup: హాకీ వరల్డ్ కప్ నుంచి భారత్ ఔట్.. క్వార్టర్స్ కూడా చేరకుండానే నిష్క్రమణ
అందరూ ఒకే చోట గుమిగూడి వేడుకలు జరుపుకొంటుండగా, ఒక దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం గన్ మెషీన్ చేత బట్టిన ఒక వ్యక్తి అక్కడివారిపై కాల్పులు జరిపాడు. గన్ మెషీన్ వరుసగా లోడ్ చేస్తూ కాల్పలుకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పది మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఘటన సమాచారం అందుకున్న భద్రతా దళాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా, కాల్పులకు పాల్పడ్డ నిందితుడి కోసం పోలీసులు గాలించారు. పోలీసులు ఘటనా స్థలంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలను చుట్టుముట్టారు.
ఈ ప్రాంతం మొత్తాన్ని తమ అధీనంలో ఉంచుకుని గాలించారు. తనను భద్రతా బలగాలు చుట్టుముట్టినట్లు గుర్తించిన నిందితుడు గన్ మెషీన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిందితుడిని 72 సంవత్సరాల హు క్యాన్ ట్రాన్‌గా గుర్తించారు. అతడు ఒక వ్యాన్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాన్ దగ్గరికి పోలీసులు వస్తుండటం గమనించి, అతడు తనను తాను కాల్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, కాల్పుల ఘటనకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.
ఈ ఘటనలో ఇతర అనుమానిత వ్యక్తులెవరూ లేరని పోలీసులు తెలిపారు. అయినప్పటికీ, అన్ని అంశాల్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనలో మృతులకు నివాళిగా అమెరికా జాతీయ జెండాల్ని అవనతం చేయాలని అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు.