Home » Author »Narender Thiru
వైఎస్ షర్మిలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఇటీవల షర్మిలను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రధాని ఆరా తీశారు. షర్మిలకు సానుభూతి తెలిపారు.
రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ త్వరలో ముగియనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరో యాత్రను రెడీ చేస్తోంది. ప్రజలకు చేరువయ్యే లక్ష్యంతో ప్రియాంకా గాంధీ కూడా యాత్ర చేయబోతున్నారు.
ఎలన్ మస్క్ స్థాపించిన సంస్థల్లో ఒకటి ‘న్యూరాలింక్’. మనిషి మెదడులో చిప్ అమర్చి, దాని ద్వారా కంప్యూటర్ను కంట్రోల్ చేయగలగడమే ఈ కంపెనీ చేసే పని. అయితే, ఈ కంపెనీకి ప్రస్తుతం ఎదురుదెబ్బ తగిలింది.
కోవిడ్ వైరస్ విషయంలో చైనా పాత్ర మరోసారి వెలుగు చూసింది. చైనాలోని వుహాన్ ల్యాబొరేటరీలోనే కోవిడ్ వైరస్ తయారు చేసినట్లు తాజాగా ఒక సైంటిస్ట్ వెల్లడించాడు. ప్రమాదవశాత్తు ల్యాబ్‌లో ఈ వైరస్ లీకై, ప్రపంచమంతా వ్యాపించిందన్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడలో మంగళవారం ఉదయం నుంచి ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ ఇండ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి.
బలవంతపు మత మార్పిడులు ప్రమాదకరమని, రాజ్యాంగ వ్యతిరేకమని వ్యాఖ్యానించింది భారత సుప్రీంకోర్టు. ఛారిటీ చేయడం అంటే మత మార్పిడులకు పాల్పడటం కాదని అభిప్రాయపడింది.
మహిళలు, హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏఐయూడీఎఫ్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్‌కు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆడవాళ్లు పిల్లల్ని కనే పరిశ్రమలు కాదన్నారు.
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించబోతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. గత 15 ఏళ్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి ప్రతిపక్షానికే పరిమితమయ్యే అవకాశం ఉంది.
లిక్కర్ స్కాం కేసుపై కవిత, కేసీఆర్ మీటింగ్
మరోసారి సామాన్యులకు ఆర్బీఐ షాక్..?
పాతబస్తీలో 'గలీజ్ బాబా' గుట్టు రట్టు
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరగబోతుంది. ఆయన కుమార్తె రోహిణి కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చారు. సోమవారం ఆమె కిడ్నీ దానం చేయబోతున్నారు.
కొబ్బరి ముక్క చిన్నారి ప్రాణం తీసింది. కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఏడాది వయసున్న చిన్నారి బాబు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తెలంగాణ, నెక్కొండ మండలంలో జరిగింది.
చిన్నారులు తోటలో ఆడుకుంటుండగా వారికి చిక్కుడులాంటి గింజలున్న మొక్క కనిపించింది. వెంటనే పిల్లలు వాటిని తిన్నారు. నలుగురు పిల్లలు ఈ గింజలు తినగా, వారిలో ముగ్గురు మరణించారు.
మధ్య ప్రదేశ్‌లో ‘లవ్ జిహాద్’కు వ్యతిరేకంగా కొత్త చట్టం తీసుకొస్తామని ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. ఇటీవల శ్రద్ధా వాకర్ హత్య నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని ఒక పోలింగ్ స్టేషన్లో ఆయన తన ఓటు వేశారు.
స్కూల్లో ఉదయం అందరితో కలిసి ప్రేయర్ చేస్తున్న టీచర్ ఉన్నట్లుండి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దీంతో స్టూడెంట్స్, స్టాఫ్ ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
దేవాలయంలో డాన్స్ చేయకూడదనే సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొందరు దేవాలయాల్లో అనవసర వీడియోలు తీసుకుంటూ విమర్శల పాలవుతున్నారు. తాజాగా ఇద్దరు మహిళలు ఉద్యోగం పోగొట్టుకున్నారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆదివారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ ఇంట్లోకొ చొచ్చుకెళ్లిన కొందరు దండగులు దాడికి పాల్పడ్డారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డాన్స్ చేశారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఒక సభా వేదికపై గిరిజనులతో కలిసి సరదాగా నృత్యం చేశారు. ఆయనతోపాటు సీఎం అశోక్ గెహ్లాట్, ఇతర నేతలూ పాదం కదిపారు.