Home » Author »Narender Thiru
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ నాలుగు రోజులపాటు రాజస్థాన్‌లోనే పర్యటించనున్నారు. తన కొడుకు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంకా గాంధీతో కలిసి వేడుకలు జరుపుకొన్నారు.
ఈ ఏడాది ఆగష్టు నాటికి కేంద్రంలో మొత్తం 9,79,327 ఉద్యోగాలు ఖాళీలున్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇందులో గ్రూప్ ఏ ఉద్యోగాలు 23,584కాగా, గ్రూప్ బి ఉద్యోగాలు 1,18,807, గ్రూప్ సి ఉద్యోగాలు 8,36,936 ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
వైసీపీకి ఏ గ్రీన్ కలర్ ఇష్టమో చెప్పాలని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. తన ప్రచార రథం ‘వారాహి’ రంగుపై వైసీపీ చేస్తున్న విమర్శలకు పవన్ ట్విట్టర్లో సమాధానం చెప్పాలన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు ఈ నెల 12న ఆన్లైన్లో విడుదల చేయబోతున్నట్లు టీటీడీ వెల్లడించింది.
శ్రద్ధా వాకర్ హత్య తర్వాత తొలిసారిగా ఆమె తండ్రి వికాస్ వాకర్ మీడియాతో మాట్లాడారు. నిందితుడు ఆఫ్తాబ్కు మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేశాడు. మొబైల్ యాప్స్ విషయంలో నియంత్రణ విధించాలన్నాడు.
‘సెజ్’ పరిధిలోని కంపెనీల్లో పని చేసే ఐటీ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వర్క్ ఫ్రం హోం పద్ధతిని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఉద్యమం చేస్తున్న మహిళల విషయంలో అక్కడి భద్రతాదళాలు దాష్టీకానికి పాల్పడ్డాయి. మహిళల్ని అతి దగ్గరి నుంచి పోలీసులు కాల్చి చంపారు.
ఇటీవలే వైఎస్.షర్మిలను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు ఆమెను మరోసారి అరెస్టు చేశారు. పాదయాత్రకు అనుమతివ్వాలని కోరుతూ ఆమె హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట షర్మిల దీక్ష చేపట్టారు.
‘బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్’ పొందాలంటే వినియోగదారులు ప్రతి నెలా డబ్బులు చెల్లించేలా ఎలన్ మస్క్ కొత్త నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో మస్క్ ఈ సబ్స్క్రిప్షన్ ఛార్జీలు పెంచబోతున్నాడు.
వచ్చే ఏడాది టీమిండియా ఆడబోయే సిరీస్‌ల వివరాల్ని బీసీసీఐ వెల్లడించింది. శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో ఇండియా టీ20, వన్డే, టెస్ట్ మ్యాచ్‌లు ఆడబోతుంది.
వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో కాంట్రాక్ట్ కిల్లర్‌కు డబ్బులిచ్చి మరీ ర్తను చంపించింది ఒక మహిళ. ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. పోలీసులు విచారణలో అసలు విషయం వెలుగు చూసింది.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తొలిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్ ఎన్నికైంది. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున బాబీ కిన్నార్ విజయం సాధించింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ‘ఆమ్ ఆద్మీ పార్టీ’కి జాతీయ హోదా దక్కే అవకాశాలున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం రెండు స్థానాలు దక్కించుకుంటే చాలు.
ప్రపంచ కుబేరుడిగా కొనసాగుతున్న ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్‌కు బుధవారం ఎదురుదెబ్బ తగిలింది. ఆయన తన నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయి, రెండో స్థానానికి పడిపోయాడు.
దేశంలో వచ్చే ఏడాది నుంచి ఎండలు మండబోతున్నాయి. ప్రజలు భరించలేనంతగా ఎండలు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయని ప్రపంచ బ్యాంకు నివేదిక తేల్చింది.
గురువారం గుజరాత్‌తోపాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుందునే ప్రచారం మొదలైంది.
జమ్ము-కాశ్మీర్ లోయను చలి వణికిస్తోంది. ఈ ప్రాంతంలో వరుసగా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. మరో నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది.
కర్ణాటకను అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఏమీ చేయలేదని విమర్శించారు ఆ రాష్ట్ర సీఎం బసవరాజు బొమ్మై. త్వరలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు.
ఈ ఏడాది ‘వర్డ్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచింది ‘గోబ్లిన్ మోడ్’. ప్రముఖ డిక్షనరీ సంస్థ ఆక్స్ఫర్డ్ ఈ పదాన్ని ఎంపకి చేసింది. ఆన్లైన్ సర్వే ద్వారా ఈ పదాన్ని ఎంపిక చేసి, ప్రకటించింది.
ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడని ప్రచారం జరుగుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్సాహంగా కనిపించాడు. ఒక బ్రిడ్జిపై కారు నడుపుకొంటూ వెళ్లాడు. తర్వాత కొద్ది దూరం నడిచాడు.