Home » Author »Narender Thiru
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నేడు రెండో దశ పోలింగ్ జరగనుంది. 14 జిల్లాల్లోని 93 అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నిక జరుగుతుంది. 2.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు వేయనున్నారు.
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రక్రియ వికటించి ఒక వ్యక్తి మరణించాడు. ఢిల్లీ పరిధిలో ఈ ఘటన జరిగింది. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న వ్యక్తికి కిడ్నీతోపాటు మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయి.
యూపీలోని గయ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన రెండు బోగీలు ఇంజిన్ నుంచి విడిపోయాయి. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి హానీ కలగలేదని అధికారులు తెలిపారు.
బంగ్లాదేశ్‌తో ఇండియా మొదటి వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది.
దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ పీలే అనారోగ్యంపై కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన పరిస్థితి విషమంగా ఉందని ప్రచారం జరిగింది. దీనిపై పీలే స్వయంగా ఒక ప్రకటన చేశారు.
దశాబ్దాలుగా అమలు చేస్తున్న హిజాబ్ చట్టాన్ని ఇరాన్ రద్దు చేయబోతుందా? దేశవ్యాప్తంగా సాగుతున్న ఆందోళనల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వంలో మార్పు వచ్చిందా? తాజా విషయం ఏంటంటే..
ఒక్కసారి నాటితే నాలుగేళ్లపాటు వరుసగా కోతకొచ్చే పంటను చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఎనిమిదిసార్లు ఈ వరి కోతకొస్తుంది. చైనాలో ఇప్పటికే ఈ పంట పండిస్తున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి రెండు రోజులపాటు ఏపీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత ఏపీ వస్తుండటం ఇదే తొలిసారి.
సంచలనం సృష్టించిన అంకిత భండారి హత్య కేసు నిందితులకు పోలీసులు నార్కో టెస్ట్ నిర్వహించబోతున్నారు. రిసార్టులో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న అంకితను యజమాని, మరో ఇద్దరితో కలిసి హత్య చేసిన సంగతి తెలిసిందే.
బంగ్లాదేశ్ సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్‌తో టీమిండియా మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. నేటి ఉదయం 11.30 గంటలకు తొలి వన్డే ప్రారంభమవుతుంది.
దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. మొత్తం 250 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్, బీజేపీ ప్రధానంగా పోటీ పడుతున్నాయి.
నోయిడాకు చెందిన ఒక యువతి తన బంధువులను అక్రమ కేసులో ఇరికించేందుకు కనీవినీ ఎరుగని దారుణానికి తెగబడింది. తనలాగే ఉండే ఒక మహిళను చంపి, తనే ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించింది.
జీఎస్టీ వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. గత ఏడాది నవంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది నవంబర్ నెల జీఎస్టీ వసూళ్లు 11 శాతం పెరిగాయి. గత నెలలో మొత్తం రూ.1.46 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది.
ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న గోల్డీ బ్రార్‌ను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోడలు, నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి లదాఖ్ ప్రాంతంలో చేసిన బైక్ రైడ్ వీడియో నెటిజన్లు ఆకట్టుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి రెండు రోజులపాటు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. అక్కడ వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభిస్తారు.
అమెరికాలోని న్యూయార్క్, సింగపూర్ నగరాలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా నిలిచాయి. ఈ ఏడాది వివిధ నగరాల్లో ఖరీదైన జీవన విధానం ఆధారంగా ఒక మీడియా సంస్థ తాజా జాబితా రూపొందించింది.
దేశంలో జన్యుమార్పిడి పంటలు విడుదల చేయడంపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జన్యుమార్పిడి పంటలను దేశంలో నిషేధించాలని కోరుతూ దాఖలైన ఒక పిటిషన్‌ను కోర్టు విచారించింది.
తనతో గొడవపడ్డ ఒక వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకునేందుకు అతడి కూతురుపై హత్యాచారానికి పాల్పడ్డాడో బాలుడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతంలో గురువారం జరిగింది.
ఐపీఎల్-2023 కోసం త్వరలో మినీ వేలం జరగనుంది. ఈ నెల 23న కేరళలోని కోచిలో ఐపీఎల్ మినీ వేలం నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఐపీఎల్‌లోని పది జట్లు ఈ పోటీలో పాల్గొంటాయి.