Pawan Kalyan: రూల్స్ పవన్ కల్యాణ్‌కేనా? వైసీపీపై ట్విట్టర్లో విరుచుకుపడుతున్న పవన్ కల్యాణ్

వైసీపీకి ఏ గ్రీన్ కలర్ ఇష్టమో చెప్పాలని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. తన ప్రచార రథం ‘వారాహి’ రంగుపై వైసీపీ చేస్తున్న విమర్శలకు పవన్ ట్విట్టర్లో సమాధానం చెప్పాలన్నారు.

Pawan Kalyan: రూల్స్ పవన్ కల్యాణ్‌కేనా? వైసీపీపై ట్విట్టర్లో విరుచుకుపడుతున్న పవన్ కల్యాణ్

Updated On : December 13, 2022 / 10:43 AM IST

Pawan Kalyan: జనసేన ఎన్నికల ప్రచార రథం ‘వారాహి’ రంగుపై వైసీపీ చేస్తున్న విమర్శలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ట్విట్టర్లో వైసీపీ తీరుపై విమర్శలు చేస్తున్నారు. గ్రీనరీ పార్క్ ఫొటో ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్.. వైసీపీకి ఆ ఫొటోలోని ఏ గ్రీన్ రంగు ఇష్టమో చెప్పాలన్నారు. రూల్స్ పవన్ కల్యాణ్‌కు మాత్రమేనా అంటూ మరో ట్వీట్ చేశారు.

TTD: డిసెంబర్ 12న శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా విడుదల

అసూయతో వైసీపీ వెన్నెముక కుళ్లిపోతుందంటూ అర్థం వచ్చేలా మరో ట్వీట్ చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటీవల వెళ్లిపోయిన కంపెనీల గురించి ప్రస్తావించారు. కారు టు కట్ డ్రాయర్ అంటూ ఈ అంశంపై ట్వీట్ చేశారు. ‘‘వైసీపీ టిక్కట్‌ రేట్‌లు, కారు రంగులు, కూల్చడాలు లాంటి చిల్లర పనులు ఆపి ఏపీ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. ఇప్పటికే ఏపీలో వీరి లంచాలు, వాటాలు వేధింపుల వలన ‘కారు నుంచి కట్‌ డ్రాయర్‌ కంపెనీల’ దాకా పక్క రాష్ట్రానికి తరలిపోయాయ్‌’’ అటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

Work From Home: ఐటీ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. అక్కడి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుమతి

రెండు రోజుల క్రితం పవన్ కల్యాణ్ తన వారాహి రథం గురించి వెల్లడించారు. ఇది ఆలివ్ గ్రీన్ కలర్‌లో ఉండటంతో దీనిపై వైసీపీ నేతలు పేర్ని నానితోపాటు పలువురు విమర్శలు చేశారు. దీంతో వరుస ట్వీట్లతో పవన్ కల్యాణ్ వారికి గట్టి కౌంటర్ ఇస్తున్నారు.