Work From Home: ఐటీ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. అక్కడి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుమతి

‘సెజ్’ పరిధిలోని కంపెనీల్లో పని చేసే ఐటీ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వర్క్ ఫ్రం హోం పద్ధతిని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Work From Home: ఐటీ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. అక్కడి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుమతి

Work From Home: ఐటీ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సెజ్ (స్పెషల్ ఎకనమిక్ జోన్) పరిధిలోని ఐటీ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఎప్పటినుంచో అమలవుతున్నప్పటికీ, దీన్ని తాజాగా వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగించింది.

Anti-Hijab Protests: ఇరాన్‌లో భద్రతాదళాల దాష్టీకం.. మహిళల కళ్లు, మర్మాంగాలపై విచక్షణారహితంగా కాల్పులు

దీని ప్రకారం ఇకపై ‘సెజ్’లోని కంపెనీల్లో పని చేసే వంద శాతం ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం లేదా సెజ్ బయట ఎక్కడి నుంచైనా పనిచేసుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రటకన విడుదల చేసింది. అయితే, దీన్ని కంపెనీలు అమలు చేసే విషయంలో కొన్ని సూచనలు చేసింది. ఈ నిర్ణయాన్ని అమలు చేసే కంపెనీలు స్థానిక డెవలప్‌మెంట్ కమిషనర్‌కు విషయాన్ని తెలియజేయాలి. లేఖ ద్వారా అనుమతి పొందాలి. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రం హోం పొందాలి అనుకుంటే సంబంధిత గడువు ముగిసేలోగా తిరిగి అనుమతి తీసుకోవాలి. ఎంత మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు అనే విషయాన్ని ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం లేదు.

YS.Sharmila: వైఎస్.షర్మిల మరోసారి అరెస్ట్.. ట్యాంక్‍బండ్ వద్ద అరెస్టు చేసిన పోలీసులు

కానీ, ఆ వివరాల్ని కంపెనీలు మాత్రం నమోదు చేసుకోవాలి. కోవిడ్ సందర్భంలో ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోం పద్ధతికి అనుమతించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఏడాది పాటు మాత్రమే దీనికి అనుమతించారు. అందులోనూ 50 శాతం ఉద్యోగులకు మాత్రమే అనుమతి ఉండేది. కానీ, తర్వాత దీన్ని పొడిగిస్తూ, వంద శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం పద్ధతిలో పని చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది.