Anti-Hijab Protests: ఇరాన్‌లో భద్రతాదళాల దాష్టీకం.. మహిళల కళ్లు, మర్మాంగాలపై విచక్షణారహితంగా కాల్పులు

ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక ఉద్యమం చేస్తున్న మహిళల విషయంలో అక్కడి భద్రతాదళాలు దాష్టీకానికి పాల్పడ్డాయి. మహిళల్ని అతి దగ్గరి నుంచి పోలీసులు కాల్చి చంపారు.

Anti-Hijab Protests: ఇరాన్‌లో భద్రతాదళాల దాష్టీకం.. మహిళల కళ్లు, మర్మాంగాలపై విచక్షణారహితంగా కాల్పులు

Anti-Hijab Protests: ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దేశంలోని మహిళలు, కొందరు పురుషులు కూడా ఈ ఉద్యమంలో విస్త్రృతంగా పాల్గొన్నారు. అయితే, ఇరాన్ భద్రతా దళాలు ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో అనేకసార్లు కాల్పులకు పాల్పడ్డాయి. సాధారణంగా ఆందోళనల సమయంలో అప్పుడప్పుడూ కాల్పులు జరుగుతుంటాయి.

BRS Party: అట్టహాసంగా భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం.. ఈసీ పత్రాలపై సంతకం చేసిన సీఎం కేసీఆర్..

కానీ, ఇరాన్‌లో జరిగిన కాల్పులు మాత్రం చాలా అమానుషమైనవని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. అక్కడి మహిళలపై భద్రతా దళాలు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డట్లు ఈ నివేదిక తేల్చింది. ‘ది గార్డియన్’ పత్రిక కథనం ప్రకారం.. ఉద్యమకారులపై పోలీసులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. మహిళల్ని చాలా దగ్గరి నుంచి కాల్చారు. కళ్లు, ఛాతి, మర్మావయవాలు, తొడలపై కాల్చారు. మగవారికైతే కాళ్లు, పిరుదులు, వెనుక భాగంలో కాల్చారు. మరణించిన అనేక మంది శరీర భాగాల్లో ఈ గాయాలు చాలా స్పష్టంగా కనిపించాయి. కాల్పుల్లో గాయపడిన మహిళలకు చికిత్స చేసిన డాక్టర్లు ఈ అంశంపై మాట్లాడారు.

YS.Sharmila: వైఎస్.షర్మిల మరోసారి అరెస్ట్.. ట్యాంక్‍బండ్ వద్ద అరెస్టు చేసిన పోలీసులు

‘‘నేను హిజాబ్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న 20 ఏళ్ల ఒక మహిళకు చికిత్స చేశాను. ఆమె మర్మాంగాల నుంచి రెండు పెల్లెట్లు బయటకు తీశాను. తొడ భాగం నుంచి 10 పెల్లెట్లు బయటకు తీశాను. ఈ పది పెల్లెట్టు తీయడం చాలా సులభమైంది. కానీ, మిగతా వాటిని తొలగించడం చాలా కష్టమైంది’’ అని ఒక డాక్టర్ చెప్పింది. సాధారణంగా ఉద్యమాలు జరుగుతుంటే వాటిని అణచివేసేందుకు కాళ్లపై కాల్చడం వంటి సులభతర మార్గాల్ని పోలీసులు అనుసరించలేదని అక్కడి మహిళలు ఆరోపిస్తున్నారు. హిజాబ్ సరిగ్గా ధరించని కారణంగా అరెస్టై, పోలీసుల దెబ్బలకు మహ్సా అమిని అనే యువతి మరణించింది.

దీనికి నిరసనగా గత సెప్టెంబర్ 16 నుంచి ఇరాన్ వ్యాప్తంగా ఉద్యమం మొదలైంది. హిజాబ్ రద్దు చేయాలని కోరుతూ మహిళలు, పురుషులు రోడ్డెక్కారు. వీటిని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రయత్నించింది. కానీ, ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరిగింది. చివరకు ఈ అంశంపై పునరాలోచిస్తామని ఇరాన్ ప్రకటించింది.