Home » Author »naveen
సోమాలియా బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. రాజధాని మొగదిషులో రెండు శక్తిమంతమైన కారుబాంబు పేలుళ్ల సంభవించాయి. ఈ ఘటనలో 100 మంది మరణించారు.
ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో ఎట్టకేలకు పాకిస్తాన్ బోణీ కొట్టింది. ఈ టోర్నీ తొలి విజయం నమోదు చేసింది.
తిరుపతిలో పూర్వ ప్రజారాజ్యం పార్టీ నేతలు భేటీ అయ్యారు. వైసీపీ మినహా మిగిలిన అన్ని పార్టీల్లోని మాజీ ప్రజారాజ్యం నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. సమావేశంలో పెద్ద సంఖ్యలో బలిజ సామాజికవర్గ నేతలు పాల్గొన్నారు.
జనసేన నేతలకు పవన్ కల్యాణ్ క్లాస్ తీసుకున్నారు. పని చేసే వారికే పార్టీలో చోటు ఉంటుందని తేల్చి చెప్పారు. వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేయాలన్నారు పవన్ కల్యాణ్.
నిజామాబాద్ డిచ్ పల్లిలో దారుణం వెలుగుచూసింది. అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని చిదిమేశాడో కామాంధుడు. వావి వరుసలు మరిచి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
నీతి, నిజాయితీ పక్కనపెట్టి భారీ మొత్తంలో ఆస్తులు వెనకేసుకుంటూ లేనిపోని ఆడంబరాలకు పోతున్న రోజులివి. అలాంటి ఈ రోజుల్లోనూ సాదాసీదా నేతలు, నిరుపేద ఎమ్మెల్యేలు ఉన్నారంటే నమ్ముతారా?
దక్షిణ కొరియాలో హాలోవీన్ వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ వేడుకల్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 59 మంది గుండెపోటుతో మరణించారు.
కొన్నేళ్లుగా ఈ సంస్థలు వరుస నష్టాలను చవిచూస్తున్నాయి. అమెజాన్ భారీ నష్టాల్లో ఉందని ఆ మధ్య బయటకు వస్తే, ఫ్లిప్ కార్ట్ పరిస్థితి కూడా అంతే అంటూ ఇప్పుడు లేటెస్ట్ రిపోర్టులు చెబుతున్నాయి.
ఎల్కేజీ చిన్నారిపై లైంగిక దాడి కేసులో బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి, ఆమె కారు డ్రైవర్ రజనీకుమార్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులను 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది.
మయోసైటిస్ అనేది అరుదైన వ్యాధి. లక్షలో నలుగురి నుంచి 20 మందికి సోకే జబ్బు. వైద్య పరిభాషలో చెప్పాలంటే.. ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్. ఇది అరుదైన వ్యాధి మాత్రమే కాదు.. నొప్పులు, అలసటతో పేషెంట్‌కు నరకం చూపిస్తుంటుంది. ఈ వ్యాధిలో మొత్తం ఐదు రకాలు ఉన్నాయి.
నెల్లూరులోని మైపాడు గేట్ సెంటర్ సమీపంలోని మాంసపు దుకాణాల్లో కుళ్లిన కోడి మాంసం విక్రయాలు బయటపడ్డాయి. అధికారులు నిర్వహించిన తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.
జనసేన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కీలక అంశాలతో పాటు పొత్తుల అంశాలపై నేతలకు క్లారిటీ ఇవ్వనున్నారు పవన్ కల్యాణ్.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులకు ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో నిందితుల రిమాండ్ రిజక్ట్ చేశారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.
టీఆర్ఎస్ నేతలెవరూ ఎవరూ మాట్లాడొద్దని ఆదేశించిన కేటీఆర్.. కేసు దర్యాఫ్తు ప్రాథమిక దశలో ఉందన్నారు. మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని, పార్టీ శ్రేణులకు సూచించారు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 39వేల 917 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 35వేల 301 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 505గా ఉంది.
వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో అత్యధిక మెజారిటీతో గెలిచి చరిత్ర తిరగరాసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో తాడు ఓడిపోయినా, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నానని చంద్రబాబు దృష్టికి తెచ్చారు లోకేశ్.
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదైంది. ఉత్కంఠపోరులో పాకిస్తాన్ పై జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో దారుణం జరిగింది. భార్య ఆత్మహత్యకు పాల్పడుతున్నా భర్త ఆపలేదు. సరికదా.. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కేసులో సీఐడీపైన ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది.
తిరుమల శ్రీవారి కళ్యాణకట్టలో క్షురకులు ధర్నా నిర్వహించారు. విజిలెన్స్ తనిఖీలకు నిరసనగా విధులు బహిష్కరించి కళ్యాణకట్టలో ఆందోళన చేపట్టారు. తమపై విజిలెన్స్ అధికారులు ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు.