Husband Records Wife Suicide : షాకింగ్.. భార్య ఆత్మహత్యను ఆపకుండా వీడియో తీసిన భర్త
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో దారుణం జరిగింది. భార్య ఆత్మహత్యకు పాల్పడుతున్నా భర్త ఆపలేదు. సరికదా.. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Husband Records Wife Suicide : ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో దారుణం జరిగింది. ఓ భర్త చేసిన పని అందరిని షాక్ కు గురి చేసింది. తన భార్య ఆత్మహత్యకు పాల్పడుతున్నా అతడు ఆపలేదు. ఉరేసుకుంటున్నా అడ్డుకోలేదు. సరికదా.. దాన్ని వీడియో తీశాడా శాడిస్ట్ మొగుడు. అంతేకాదు ఆ సూసైడ్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశాడు.
మృతురాలిని శోబితా గుప్తాగా గుర్తించారు. శోబితా, సంజీవ్ గుప్తా(37) దంపతులు. భార్య తన భర్తతో గొడవ పడింది. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుంది. కాగా, తన భార్య ఆత్మహత్యకు పాల్పడుతున్నా అతడు ఆపలేదు. పైగా దాన్ని తన సెల్‌ఫోన్ తో వీడియో తీశాడు. భర్త వీడియోను రికార్డు చేస్తున్నాడని తెలిసి మంచం నుంచి కిందికి దిగిన భార్య అతనితో గొడవ పడింది. మళ్లీ వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది.
సంఘటన జరిగిన తర్వాత శోబిత తల్లిదండ్రులకు సంజీవ్ సమాచారం అందించాడు. వారు సంఘటనా స్థలానికి వచ్చి చూసేసరికి ఆమె మృతదేహం మంచంపై పడి ఉంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
”మేము ఇంటికి చేరుకున్నప్పుడు, మా కుమార్తె మృతదేహం మంచం మీద పడి ఉంది. సంజీవ్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అలాగే కూర్చున్నాడు. మేము వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాము. శోబిత చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తనకేమీ తెలియదు అన్నట్లు సంజీవ్ తీసిన వీడియో తమకిచ్చాడని, శోబిత ఇంతకు ముందు కూడా ఉరి వేసుకోవడానికి ప్రయత్నించిందని అతను మాతో చెప్పాడు” అని శోబిత తండ్రి రాజ్‌కిషోర్ చెప్పారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శాడిస్ట్ భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీడియోతో సహా మొత్తం ఘటనపై విచారణ జరుపుతున్నారు. భర్త సంజీవ్ ను ప్రశ్నిస్తున్నారు.
కట్నం కోసం సంజీవ్ గుప్తా తన భార్యను వేధించినట్లు పోలీసుల విచారణలో తేలింది. సంజీవ్ గుప్తా ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తాడు. అతడికి శోబితతో ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వారికి మూడేళ్ల కూతురు ఉంది. కాగా, దంపతులు తరుచుగా గొడవపడేవారు. మంగళవారం ఉదయం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భర్త తీరుతో విసిగిపోయిన భార్య ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించింది. తన గదిలోకి వెళ్లింది. సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. అదే రూమ్ కి వచ్చిన భర్త సంజీవ్ గుప్తా.. భార్యను ఆపాల్సింది పోయి.. దాన్ని వీడియో తీశాడు. దాన్ని వీడియో తీసి ఆమె తల్లిదండ్రులకు పంపాలని సంజీవ్ గుప్తా అనుకున్నాడు. మీ కూతురు ఎలాంటి న్యూసెన్స్ చేస్తుందో చూడండి అని వారికి చెప్పాలని అనుకున్నాడు. కానీ, ఇంతలో దారుణం జరిగిపోయింది.
ఉరేసుకున్న భార్య, వీడియో తీసిన భర్త
पति वीडियो बनाता रहा, पत्नी ने फांसी लगाकर दी जान। वायरल वीडियो कानपुर का है.@Uppolice #Kanpur #Lakshmi #Religion pic.twitter.com/Ujl3ep5wwH
— rajni singh (@imrajni_singh) October 26, 2022