నీటిని వృథా చేస్తే రూ.లక్ష జరిమానాతో పాటు 5 ఏళ్ల జైలు : కేంద్రం హెచ్చరిక

  • Published By: nagamani ,Published On : October 24, 2020 / 10:57 AM IST
నీటిని వృథా చేస్తే రూ.లక్ష జరిమానాతో పాటు 5 ఏళ్ల జైలు : కేంద్రం హెచ్చరిక

Delhi wastage or misuse Rs.1lakh fine and five years in jail : నీటిని వృథా చేస్తున్నారా? అయితే మీకు జైలుశిక్ష తప్పదు..అంతేకాదు మీ జేబులే కాదు మీ బ్యాంక్ ఎకౌంట్ కూడా ఖాళీ అయిపోయేంత జరిమానా కూడా తప్పదు..కాబట్టి ఇకనుంచైనా జాగ్రత్తగా ఉండండీ అంటే కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. నీటిని వృథా చేస్తే రూ. లక్ష రూపాయల జరిమానాతో పాటు 5 సంవత్సరాలు జైలుశిక్ష తప్పదంటూ కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ హెచ్చరించింది.


జీవకోటికి ప్రాణాధారమైన నీటికి వృథా ఎవ్వరికీ మంచిది కాదు. రానున్న తరాలకు మనం ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా ప్రాణాధారమైన నీటినైనా ఇద్దాం అనే విచక్షణ ప్రతీ ఒక్కరిలోను రావాల్సిన అవసరముంది. ఈ క్రమంలో చిన్నపాటి అవరసరానికి నీటిని వృథాగా వాడేసేవారు ఇకనుంచైనా జాగ్రత్తలు పాటించాలనే ఉద్ధేశ్యంతో కేంద్రం జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని భూగర్భ జనాలల అథారిటీ ఓ నోటిషికేషన్ విడుదల చేసింది.



https://10tv.in/minister-kannababu-comments-on-chandrababu-and-lokesh-over-his-visit-in-flood-areas/
చాలామంది అవసరానికి మించి ట్యాప్ తిప్పి నీటిని బుడబుడా పారబెట్టేస్తుంటారు. ముఖం కడుక్కోవడానికి బకెట్ నిండా నీటిని పారబోస్తారు. అలా నీటిని వృథా చేయొద్దు అని ఎంత మొత్తుకున్నా వినరు. పైగా మేం వాటర్ ట్యాక్స్ కడుతున్నాం మా ఇష్టమొచ్చినట్లుగా వాడుకుంటామంటూ మూర్ఖంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి.


అలా నీటి విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించేవారికి కఠిన శిక్షలు విధించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986లోని సెక్షన్ 5 ప్రకారం ఈ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. భూగర్భ జలాలను వృథా చేస్తే లక్ష రూపాయల వరకు జరిమానాతో పాటు 5ఏళ్ళ వరకు జైలుశిక్ష విధించవచ్చు అని పేర్కొంది.


జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) ఇటీవల ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ నోటిఫికేషన్‌ను జారీచేసింది. రాజేంద్ర త్యాగి అండ్ ఫ్రెండ్స్ (ఎన్‌జీవో) దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్‌జీటీ ఈ ఆదేశాలు జారీచేసింది. నీటిని వృథా చేయడం, దుర్వినియోగం చేయడాన్ని శిక్షించదగ్గ నేరంగా పరిగణించాలని పిటిషనర్ కోరారు.


రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని స్థానిక సంస్థలు, జల నిగమ్‌లు, జల మండలులు, వాటర్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ నీటి వృథాను, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టవలసి ఉంటుందని నోటిఫికేషన్‌లో వెల్లడించింది. భూగర్భ జలాలను దుర్వినియోగం, వృథా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది.


ఈ విషయమై జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి యూపీ సింగ్ మాట్లాడుతూ… ‘ఓవర్‌హెడ్ ట్యాంకుల్లో నీటిని నింపేటప్పుడు, మరుగుదొడ్లలో, వంట గదుల్లో నీటిని వినియోగించేటపుడు నీరు వృథా అవుతోంది. ప్రజానీకానికి నీటి వినియోగంపై అవగాహన లేకపోవడంతోనే ఇలా జరుగుతోందనీ..ఇకనుంచి నీటి వినియోగం విషయంలో చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో నీటి సమస్యలు మరింత తీవ్రం అవుతాయి’ అని యూపీ సింగ్ తెలిపారు. అందుకే ముందు జాగ్రత్తగా నీటి వృథా విషయంలో కఠిన చర్యలు తీసుకునేందుకు నిర్ణయించామని తెలిపారు.