కరోనా పుట్టింది ఇటలీలోనే.. చైనాలో కాదంట.. ఇదిగో రుజువు అంటోన్న డ్రాగన్!

  • Published By: sreehari ,Published On : November 21, 2020 / 10:19 AM IST
కరోనా పుట్టింది ఇటలీలోనే.. చైనాలో కాదంట.. ఇదిగో రుజువు అంటోన్న డ్రాగన్!

Italy birthplace of COVID-19 pandemic : ప్రపంచాన్ని పట్టీపీడుస్తోన్న కరోనా మహమ్మారికి మూలం చైనానే అనేది అందరి వాదన.. కానీ, డ్రాగన్ మాత్రం ఆ పాపం మాది కాదంటోంది. ఇటలీనే కరోనాకు మూలం అంటూ ఓ కొత్త అధ్యయనాన్ని చూపించి తనపై పడిన నిందను చెరిపేసుకోవాలని  చూస్తోంది.



కరోనాకు పుట్టినిల్లు ఏసియన్ నేషన్ అంటూ కొత్త అధ్యయన నివేదికలను ఆధారాలుగా చూపించే ప్రయత్నం చేస్తోంది డ్రాగన్. ఈ కొత్త అధ్యయనం ప్రకారం.. ఇటలీలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలై అక్కడి నుంచి చైనా వుహాన్ సహా ఇతర దేశాలకు వ్యాపించి ఉండొచ్చునని డ్రాగన్ బుకాయిస్తోంది.

బీజింగ్‌‌లోని అధికారులు ఈ కొత్త అధ్యయన సూచనల ఆధారంగా సెప్టెంబర్ నెల ఆరంభంలోనే యూరోపియన్ నేషన్ లో కరోనా వైరస్ వ్యాప్తి మొదలై ఉండొచ్చునని అంటున్నారు. సరిగ్గా మూడు నెలల తర్వాత చైనా నగరం వుహాన్ సిటీలో కరోనా మహమ్మారి వ్యాప్తి వెలుగులోకి వచ్చింది.



దీంతో వుహాన్ సిటీనే కరోనా వ్యాప్తికి ప్రధాన కేంద్రంగా ధ్రువీకరించారు. అంతకంటే మూడు నెలల ముందే వైరస్ ఇటలీలో పుట్టి ఉండొచ్చునని డ్రాగన్ చెబుతోంది.

గతంలోనే మహమ్మారి మూలానికి సంబంధించి ఏసియన్ నేషన్ కూడా స్పెయిన్‌ను ప్రశ్నించింది. గత ఏడాదిలో అక్టోబర్‌లో మిలటరీ వరల్డ్ గేమ్స్ సమయంలో అమెరికా ఆర్మీ కూడా వుహాన్ సిటీలోనే కరోనా వ్యాప్తి ప్రారంభమైందని ఆరోపించింది.



కానీ, చైనా రాష్ట్ర మీడియా మాత్రం ఇప్పుడు నేషనల్ కేన్సర్ ఇన్సిస్ట్యూట్ కొత్త అధ్యయనాన్ని చూపించి ఇదిగో సాక్ష్యమంటోంది.. కరోనా పుట్టింది చైనాలో కాదు.. ఇటలీలోనే ఇదిగో రుజువు అంటోంది.



వాస్తవానికి కరోనా వైరస్ వుహాన్ లో విజృంభించినప్పటికీ.. మహమ్మారి పుట్టుకకు మూలం ఎక్కడో సైంటిస్టుల్లో ఇంకా ప్రశ్నార్థకంగానే మారింది. వుహాన్ సిటీలో గుర్తించడానికి ముందు.. కరోనా వైరస్ నిశ్శబ్దంగా ఎక్కడో నుంచి వ్యాప్తి చెంది ఉండొచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.