Amazon Employees Walk Off : అమెజాన్ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి.. ఆఫీసుకు రాలేమంటే తొలగిస్తారా? విధుల నుంచి వాకౌట్‌కు టెకీల ప్లాన్..!

Amazon Employees Walk Off : వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం.. అమెజాన్‌ (Amazon Layoffs) సీటెల్ హెడ్ ఆఫీసులోని వందలాది మంది ఉద్యోగులు కంపెనీ తొలగింపులకు నిరసనగా వచ్చే వారంలో విధుల నుంచి వైదొలగాలని ప్లాన్ చేస్తున్నారు.

Amazon Employees Walk Off : అమెజాన్ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి.. ఆఫీసుకు రాలేమంటే తొలగిస్తారా? విధుల నుంచి వాకౌట్‌కు టెకీల ప్లాన్..!

Amazon employees are frustrated, plan to walk off job over layoffs and work from office mandate

Amazon employees plan to walk off job over layoffs : ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. చాలాకాలంగా అనేక టెక్ కంపెనీలు వరుసబెట్టి తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. ఉద్యోగుల తొలగింపునకు కారణం ఏంటంటే? కాస్ట్ కటింగ్ అని కలరింగ్ ఇస్తున్నాయి. ఖర్చుల భారం తగ్గించుకోవడంతో పాటు ఓవర్ హైరింగ్ పేరిట ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నాయి.

ఇప్పటికే టాప్ టెక్ కంపెనీలు ఎన్నో తమ ఉద్యోగులను ఏవేవో కారణాలు చూపించి బలవంతంగా రాజీనామా చేయించుకున్నాయి. ఫలితంగా అనేక మంది టెక్ ఉద్యోగులు ఉపాధి కోల్పోయి కుటుంబాలతో సహా వీధిన పడ్డారు. ఈ గడ్డు పరిస్థితుల్లో చాలామంది ఉద్యోగుల్లో ఉద్యోగ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఉద్యోగుల్లో నైతిక స్థైర్యం కూడా భారీగా పడిపోతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో కంపెనీల తీరుపై ఉద్యోగుల్లో అసంతృప్తి రగులుతోంది.

మే 31న నిరసనకు అమెజాన్ ఉద్యోగుల పిలుపు :
వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం.. అమెజాన్ సీటెల్ హెడ్ ఆఫీసులో పనిచేసే వందలాది మంది ఉద్యోగులు వచ్చే వారంలో తమ ఉద్యోగం నుంచి వైదొలగాలని యోచిస్తున్నారు. అమెజాన్ తీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉద్యోగులంతా నిరసనకు దిగనున్నారు. ఈ మేరకు అమెజాన్ ఉద్యోగులంతా మే 31న నిర్వహించనున్న నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Read Also : Google Bard AI Chatbot : గూగుల్ బార్డ్ ఏఐ ఇమేజ్ సెర్చ్‌లో ఫొటోను చూపిస్తే.. పూర్తి వివరాలను పసిగట్టేస్తుంది.. ఎలా వాడాలో తెలుసా?

ఇప్పటికే అమెజాన్‌లోని ఇతర ఉద్యోగులకు కూడా మెసేజ్‌లు పంపుతున్నారని నివేదిక వెల్లడించింది. అమెజాన్ వార్షిక వాటాదారుల సమావేశం, ఇటీవల ఉద్యోగుల తొలగింపులు, వర్క్ ఫ్రమ్ హోంకు స్వస్తి పలికి ఆఫీసులకు రావాల్సిందేనని లేదంటే ఉద్యోగాలను తొలగిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో అమెజాన్ ఉద్యోగులంతా నిరసనకు దిగునున్నారు.

Amazon employees are frustrated, plan to walk off job over layoffs and work from office mandate

Amazon employees are frustrated, plan to walk off job over layoffs and work from office mandate

అమెజాన్ తీరుపై తీవ్ర మండిపాటు.. :
టెక్ కంపెనీలో వాతావరణ పరిస్థితులపై కూడా ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఉద్యోగుల బృందం.. అమెజాన్ తీరుపై మండిపడింది. మారుతున్న ప్రపంచానికి అమెజాన్ అనుగుణంగా ఉండాలని, కంపెనీలో సౌకర్యవంతమైన వర్కింగ్ ఆప్షన్లను పరిష్కరించడానికి తమకు నిజమైన ప్రణాళికలు అవసరమని ట్విట్టర్‌ వేదికగా తెలిపింది. ఎందుకంటే.. ఈ ఏడాది ప్రారంభంలో దాదాపు 18వేల మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత అమెజాన్ ఇటీవల మరో 9వేల మంది ఉద్యోగులను తొలగించింది.

అమెజాన్ ప్రత్యేకించి యాడ్స్, హ్యుమన్ రీసోర్సెస్, ట్విచ్ యూనిట్లు, క్లౌడ్ కంప్యూటింగ్‌తో సహా అనేక విభాగాలలో ఉద్యోగులను తొలగించింది. అమెజాన్ ఉద్యోగాల తొలగింపులకు మరో కారణం.. ఓవర్‌హైరింగ్, అనిశ్చిత ఆర్థిక పరిస్థితులుగా అమెజాన్ చెబుతోంది. ఇప్పటికే అమెజాన్ రెండు సార్లు లేఆఫ్‌లను తీసుకుంటే.. ఇప్పటివరకు ఈ-కామర్స్ దిగ్గజం 27వేల మంది ఉద్యోగులను తొలగించింది.

మెటా, గూగుల్‌లోనూ ఇదే పరిస్థితి.. :
సోషల్ మీడియా దిగ్గజమైన మెటా (Meta) వంటి ఇతర టెక్ కంపెనీలు కూడా 2023లో వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. ఉద్యోగుల తొలగింపులు, కంపెనీ తీరుపై ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. అమెజాన్ మాత్రమే కాదు.. మెటాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. టెక్ కంపెనీ తక్కువ ఆదాయ వృద్ధిని సాకుగా చూపిస్తూ వేలాది మంది ఉద్యోగులను తొలగించింది.

కంపెనీల్లో టాప్ హోదాలో ఉన్న వారికేమో పెద్ద బోనస్‌లు అందుకోవడంతో మిగిలిన ఉద్యోగుల నైతికత క్షీణించిందని నివేదిక తెలిపింది. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఉద్యోగులు కూడా తమ కంపెనీలో జరుగుతున్న తొలగింపులకు వ్యతిరేకంగా నిరసనకు సన్నద్ధమవుతున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Read Also : JioFiber Broadband Plan Offers : జియోఫైబర్ యూజర్లకు అదిరే ఆఫర్.. ఈ బెస్ట్ ప్లాన్లపై అన్‌లిమిటెడ్ డేటా, మరెన్నో ఓటీటీ బెనిఫిట్స్..!