Apple iMac Pro LED TV : Mini LED డిస్‌ప్లేతో ఆపిల్ iMac Pro టీవీ వస్తోంది.. ఎప్పుడంటే?

వచ్చే ఏడాది 2022లో ఆపిల్ కొత్త LED టీవీని ప్రవేశపెట్టబోతోంది. ఆపిల్ మ్యాక్ లైనప్‌లో ప్రత్యేకించి మినీ ఎల్ఈడీ డిస్‌ప్లేతో iMac Pro టీవీని లాంచ్ చేయనుంది.

Apple iMac Pro LED TV : Mini LED డిస్‌ప్లేతో ఆపిల్ iMac Pro టీవీ వస్తోంది.. ఎప్పుడంటే?

Apple May Launch 27 Inch Imac Pro With Mini Led Display Next Year

Apple iMac Pro LED TV :  వచ్చే ఏడాది 2022లో ఆపిల్ కొత్త LED టీవీని ప్రవేశపెట్టబోతోంది. ఆపిల్ మ్యాక్ లైనప్‌లో ప్రత్యేకించి మినీ ఎల్ఈడీ డిస్‌ప్లేతో iMac Pro టీవీని లాంచ్ చేయనుంది. ఈ ఆపిల్ iMac Pro టీవీ 27 అంగుళాల పరిమాణంలో ఉంటుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న 27-అంగుళాల Intel మోడల్‌ టీవీ స్థానంలో రానున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. ప్రతి డిస్ప్లే సప్లై చైన్ కన్సల్టెంట్‌లకు, Apple నెక్స్ట్ iMac Pro ప్రోమోషన్ టెక్నాలజీతో 27-అంగుళాల మినీ LED డిస్‌ప్లేను కలిగి ఉండనుందని సప్లయ్ చైన్ రిపోర్టు పేర్కొంది. ఈ కొత్త ఆపిల్ iMac Pro LED టీవీ 2022 వేసవిలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. మార్చి నుంచి మే మధ్య నెలలో లాంచ్ కావొచ్చునని చైన్ సప్లయ్ నివేదిక పేర్కొంది. ఆపిల్ కంపెనీ ఎప్పటినుంచో యూనివర్సల్ కంట్రోల్ ఫీచర్‌ను ప్రారంభించాలని భావిస్తోంది.

అదే సమయంలో.. Mac, iPad యూజర్లకు రెండు డివైజ్‌ల ద్వారా అవసరమైన మరింత కంటెంట్‌ను అందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. తద్వారా ఆపిల్ మినీ LED డిస్‌ప్లేల ఉత్పత్తిని రెట్టింపు చేయనుంది. వచ్చే iMac pro ఎల్ఈడీ టీవీతో ఆపిల్ ప్రొడక్టుల్లో మూడోదిగా నిలువనుంది. ఇప్పటివరకు ఆపిల్ iPad Pro, MacBook Proలో Mini LEDలను ఉపయోగించింది. ఆ రెండూ Apple సిలికాన్ ప్రాసెసర్‌లతోనే తీసుకొచ్చింది. 2022లో రాబోయే iMac Pro LED TVలో ఏదైన కొత్త ప్రాసెసర్ అందించే అవకాశం ఉంది. ఆపిల్ మినీ ఎల్ఈడీ టీవీలపై ఎప్పటినుంచో పుకార్లు వినిపిస్తున్నాయి. గతంలో ఇలాంటి రుమర్లు ఎన్నో వచ్చాయి. ఆపిల్ Next iMac Pro నెక్ట్స్ జనరేషన్ డిస్‌ప్లే టెక్నాలజీతో వస్తుందంటూ నివేదికలు తెలిపాయి. మినీ LED అనేది.. కొత్త అడ్వాన్స్‌డ్ LED టెక్నాలజీ కలిగి ఉండనుంది. OLED ప్యానెల్‌ల ద్వారా టీవీలో ఆకర్షణీయమైన కలర్లను అందించనుంది. ఈ ఆపిల్ మినీ టీవీలో చిన్నపాటి LED మాడ్యూల్స్ అమర్చడం ద్వారా బర్న్-ఇన్ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నివేదిక చెబుతోంది.

బ్లూమ్‌బెర్గ్ మార్క్ గుర్మాన్ ప్రకారం.. Apple సిలికాన్‌తో హై-ఎండ్ iMac టీవీని తీసుకొస్తోందని, 2022లో ఆపిల్ మినీ టీవీ మార్కెట్లోకి రావొచ్చునని తెలిపారు. వచ్చే ఏడాది iMac Pro 16GB RAM, 512GB SSD స్టోరేజీతో బేస్ మోడల్ కాన్ఫిగరేషన్‌తో రానుంది. టిప్‌స్టర్ ప్రకారం.. MacBook Pro మాదిరిగా iMac Proలో M1 ప్రో M1 మ్యాక్స్ చిప్‌సెట్‌ల ఆప్షన్ కూడా ఉండొచ్చు. అడిషనల్ కాన్ఫిగరేషన్‌ ఛాన్స్ కూడా ఉందని తెలిపింది. దీనికి సంబంధించి వివరాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. iMac Proలో HDMI పోర్ట్, SD కార్డ్ స్లాట్, USB-C పోర్ట్‌లను కలిగి ఉండవచ్చు. 24-అంగుళాల iMac మాదిరిగా ఛార్జింగ్ బ్రిక్ స్టాండర్డ్‌లో ఈథర్నెట్ పోర్ట్ కూడా ఉంది. ఆపిల్ కూడా ఐమాక్ ప్రోకి Face ID తీసుకురావాలని భావిస్తోంది. దీనిపై క్లారిటీ లేదని టిప్‌స్టర్ తెలిపింది.

Read Also : Netflix vs Amazon Prime Video New Plans : అమెజాన్ ప్రైమ్ ధరలు పెంచుతుంటే.. నెట్ ఫ్లిక్స్ మాత్రం ధరలు తగ్గిస్తోంది..!