Gautam Adani : గౌతమ్ అదానీ నెం.1.. ఆసియాలోనే అపర కుబేరుడు.. అంబానీని వెనక్కి నెట్టేశాడుగా..!

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముఖేశ్ అంబానీకి గట్టి షాక్ తగిలింది. ఆసియాలోనే నెంబర్ వన్ రిచెస్ట్ పర్సన్‌గా గౌతమ్ అదానీ చోటు దక్కించుకున్నారు.

Gautam Adani : గౌతమ్ అదానీ నెం.1.. ఆసియాలోనే అపర కుబేరుడు.. అంబానీని వెనక్కి నెట్టేశాడుగా..!

Asia's Richest Person Gauta

Gautam Adani : ప్రముఖ భారత పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముఖేశ్ అంబానీకి గట్టి షాక్ తగిలింది. ఆసియాలోనే నెంబర్ వన్ రిచెస్ట్ పర్సన్‌గా మరో పారిశామ్రిక వేత్త, అదానీ గ్రూపు చైర్మన్‌, గుజరాతి గౌతమ్ ఆదానీ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇప్పటివరకూ నెంబర్ వన్ స్థానంలో ఉన్న ముఖేశ్ అంబానీని వెనక్కి నెట్టేసి ఆ స్థానాన్ని చేజిక్కించుకున్నారు. 88.5 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. దాంతో దేశీయ కుబేరుల జాబితాలో అగ్రగామిగా కొనసాగిన ముకేశ్‌ అంబానీ రెండో స్థానానికి పడిపోయారు.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. గౌత‌మ్ అదానీ నికర విలువ 88.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఫలితంగా ముఖేష్ అంబానీ నిక‌ర విలువ‌ 87.9 బిలియన్ డాలర్లను గౌత‌మ్ అదానీ అధిగమించారు. వ్యక్తిగత సంపద దాదాపు 12 బిలియన్ డాలర్లు పెరుగటంతో అదానీ ఈ ఏడాదిలోనే (2022) ప్రపంచంలోనే అత్యంత కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఇటీవల అదానీ కంపెనీల షేర్ల ధరల భారీగా పెరిగిపోయాయి. కొన్ని నెలలుగా గౌతమ్ అదానీ నికర విలువ అమాంతం పెరిగిపోయింది.

దేశీయ స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. దాంతో ముఖేష్ అంబానీ రిలయన్స్ గ్రూప్ నికర విలువ కూడా భారీగా ప‌డిపోయింది. కానీ, అదానీ గ్రూప్ షేర్లు మాత్రం లాభాల్లో దూసుకెళ్లాయి. దాంతో గౌతమ్ అదానీ నికర విలువ స్థిరంగా కొన‌సాగింది. గౌతమ్ అదానీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డు నెలకొల్పారు. బ్లూమ్ బర్గ్‌ ప్రపంచ కుబేరులు 500 జాబితాలో ఫిబ్రవరి 8న భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. గౌతమ్‌ అదానీ సంపద 88.50 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. కానీ, ముకేశ్‌ అంబానీ సంపద మాత్రం 87.90 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.

ముఖేశ్ సంపద కంటే.. అదానీ సంపద 600 మిలియన్లు ఎక్కువగా నమోదైంది. ఆసియాలోనే నంబర్‌ వన్‌ ధనవంతుడిగా అదానీ అగ్రస్థానంలో నిలిచారు. అంతకుముందు ఈ నెం.1 స్థానంలో ముఖేశ్ కొనసాగారు. ప్రపంచ కుబేరుల జాబితాలో 10వ స్థానంలో కొనసాగిన ముఖేశ్‌ అంబానీ ఇప్పుడు 11వ స్థానానికి పడిపోయారు. గౌతమ్‌ అదానీ 11వ స్థానం నుంచి 10వ స్థానానికి ఎగబాకారు. ఏడాదిలో ముకేశ్‌ అంబానీ సంపద 2.07 బిలియన్లు క్షీణించగా.. అదానీ సంపద మాత్రం 12 బిలియన్లు పెరిగింది.

2008లో ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్స్ జాబితాలో గౌతమ్ అదానీ మొదటిసారిగా చోటు దక్కించుకున్నారు. ఆ సమయంలో అదానీ సంపద విలువ 9.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అప్పటి నుంచి అదానీ సంపద 10 రెట్లు మేర పెరుగుతూ వచ్చింది. ప్రపంచ కుబేరుల జాబితాలో 239.6 బిలియన్​ డాలర్లతో ఎలాన్​ మస్క్​ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. మస్క్ తర్వాత బెర్నార్డ్ అర్నాల్ట్​ 194.6 బిలియన్​ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. జెఫ్​ బెజోస్​ 183.5 బిలియన్ డాలర్లతో 3 స్థానంలో ఉన్నారు. బిల్​గేట్స్​132.2 బిలియన్​ డాలర్ల సంపదతో 4వ‌ స్థానంలో కొనసాగుతున్నారు.

Read Also : Breaking: కరోనా ముగిసింది.. ఐటీ ఉద్యోగులకూ “వర్క్ ఫ్రమ్ హోమ్” అవసరం లేదు