Cryptocurrency Update: పతనమైన క్రిప్టోకరెన్సీ.. భారీ నష్టాల్లో బిట్‌కాయిన్!

గతేడాది 2021లో క్రిప్టోకరెన్సీలో విపరీతంగా పెట్టుబడులు పెట్టారు. 2022లో కూడా క్రిప్టోకరెన్సీలో గట్టిగా పెట్టుబడులు ఉండొచ్చని ఊహించారు.

Cryptocurrency Update: పతనమైన క్రిప్టోకరెన్సీ.. భారీ నష్టాల్లో బిట్‌కాయిన్!

Crypto

Cryptocurrency Update: గతేడాది 2021లో క్రిప్టోకరెన్సీలో విపరీతంగా పెట్టుబడులు పెట్టారు. 2022లో కూడా క్రిప్టోకరెన్సీలో గట్టిగా పెట్టుబడులు ఉండొచ్చని ఊహించారు. అయితే, గత వారం రోజులుగా క్రిప్టోకరెన్సీల ధరలు భారీగా క్షీణిస్తున్నాయి. దీని కారణంగా క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాప్ రూ.75లక్షల కోట్లు తగ్గింది.

నవంబర్‌లో..
గతేడాది నవంబర్‌లో క్రిప్టోకరెన్సీల ధరలు భారీగా పెరిగాయి.
ఇటీవలికాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ ధర 67,803 డాలర్లకు చేరుకుంది. గత 6 నెలల్లో దీని ధర రెట్టింపు అయింది.
ఈ రంగం మొత్తం మార్కెట్ క్యాప్ నవంబర్‌లో మొదటిసారి $1 ట్రిలియన్‌కు చేరుకుంది.
ఇప్పుడు అది 9 లక్షల కోట్ల డాలర్లకు పడిపోయింది.
బిట్‌కాయిన్ ధర పతనం కొనసాగుతోంది

ఫెడరల్ రిజర్వ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ అమెరికా మార్కెట్‌కు ఇచ్చిన రిలీఫ్ ప్యాకేజీని ఉపసంహరించుకోవాలనే ఉద్దేశ్యం ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిప్టోకరెన్సీ పతనానికి కారణం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం భారీగా పతనమైంది. వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడితో పాటు క్రిప్టో మార్కెట్ పైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

శుక్రవారం క్రిప్టో మార్కెట్ కుప్పకూలింది. బిట్ కాయిన్ ఒక్కరోజే ఏకంగా 12 శాతం పడిపోయి 36వేల డాలర్ల దిగువకు వచ్చేసింది. జూలై నెల తర్వాత ఇదే కనిష్టం. నవంబర్ నెలలో బిట్ కాయిన్ 69వేల డాలర్ల మార్కును చేరుకుంది. ఆ రికార్డ్ గరిష్టంతో పోలిస్తే ఇప్పుడు 50 శాతం వరకు పతనమైనట్లే.

బిట్‌కాయిన్ మాత్రమే కాదు.. Ethereum 14%, ఫాంటమ్ 15%, చైన్‌లింక్ 13% తగ్గాయి. నవంబర్‌తో పోలిస్తే డాడ్జ్‌కాయిన్ 79%, కార్డానో 61%, షిబా ఇను 72%, యూనిస్వాప్ 69%, సోలానా 52%, ఎథెరియం 42% తగ్గాయి.

అయితే, క్రిప్టో కరెన్సీ మళ్లీ పుంజుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బిట్ కాయిన్ 35,347 డాలర్ల స్థాయిలో అంటే భారత రూపాయలలో 28లక్షల వరకు ఉంది. ఇది మళ్లీ పుంజుకుంటుందని, 53,000 డాలర్లను దాటుతుందని క్రిప్టో మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సమీప భవిష్యత్తులోనే 53వేల డాలర్లకు చేరుకోవచ్చు అంటున్నారు.