New Car Buying Guide : కొత్త కారు కొంటున్నారా? కొనే ముందు ఈ 5 విషయాలను తప్పక గుర్తుపెట్టుకోండి..!

New Car Buying Guide : మీరు కొత్త కారును కొనుగోలు చేస్తున్నారా? ఈ 5 విషయాలను తప్పక పాటించండి. అవేంటో ఓసారి లుక్కేయండి.

New Car Buying Guide : కొత్త కారు కొంటున్నారా? కొనే ముందు ఈ 5 విషయాలను తప్పక గుర్తుపెట్టుకోండి..!

Buying a New Car, Keep these 5 things in mind

New Car Buying Guide : భారత మార్కెట్లో కొత్త కారు కొనడం అనేది ఒక ప్రత్యేక ప్రక్రియ. కొత్త కారును ఇంటికి తెచ్చుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అందుకు భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కారు కొనుగోలుదారులు కొత్త కారును కొనడానికి ముందు పూర్తి సమాచారం తెలియకుండా సరైన నిర్ణయం తీసుకోవడం కష్టమే. కార్ల కొనుగోలు చేసే ముందు గుర్తుంచుకోవలసిన 5 ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. మీకు ఏ రకమైన కారు అవసరం? :
ఇదే, అన్నింటిలో మొదటిది.. మీకు ఏ రకమైన కారు అవసరమో నిర్ణయించుకోండి. ఇది మీ బడ్జెట్, ఫ్యామిలీ, డ్రైవింగ్ అలవాట్లు మొదలైన వాటిపై ఆధారపడి ఉండాలి. మీకు హ్యాచ్‌బ్యాక్ (వాగన్ఆర్, టియాగో, గ్రాండ్ ఐ10 నియోస్, స్విఫ్ట్, ఆల్ట్రోజ్, ఐ20,బాలెనో), సెడాన్ (డిజైర్, ఆరా, అమేజ్) ఇందులో ఏ కారు మోడల్ కావాలో నిర్ణయించుకోండి. అంతేకాదు.. సిటీ, వెర్నా, సియాజ్, SUV పంచ్, రాబోయే ఎక్స్‌టర్, బ్రెజ్జా, నెక్సాన్, వెన్యూ, క్రెటా, సెల్టోస్, గ్రాండ్ విటారా, సఫారి, XUV700, ఫార్చ్యూనర్ లేదా MPV ట్రైబర్, ఎర్టిగా, XL6, కారెన్స్, ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్ మొదలైనవి ఉన్నాయి.

2. సరైన కారు డీల్ పొందాలంటే? :
కారును ఎంచుకున్న తర్వాత.. అది అందుబాటులో ఉన్న మల్టీ డీలర్‌షిప్‌లను విజిట్ చేయండి. 3 లేదా 4 హ్యుందాయ్ డీలర్‌షిప్‌లను సంప్రదించండి. ప్రతి డీలర్‌షిప్ అదనంగా ఏదైనా ఆఫర్ చేస్తుంది. మంచి ఆఫర్‌లు, అదనపు తగ్గింపుల కోసం సేల్స్‌పర్సన్‌ని అడిగితే బెటర్. కారు రోడ్డు (OTR) ధరను చెక్ చేయండి. ఇందులో కారు ధర, రిజిస్ట్రేషన్ ధర, రోడ్డు పన్ను, బీమా, ఫాస్ట్ ట్యాగ్ వంటి ఇతర ఛార్జీలు ఉంటాయి. డీలర్‌షిప్‌లు అప్లియన్సెస్ ధరను కూడా OTRకి యాడ్ చేస్తాయి. మీరు ఏదైనా వద్దని భావిస్తే ఇప్పుడే చేయండి.

Read Also :  iPhone Users Risk Warning : ఐఫోన్ యూజర్లకు ప్రభుత్వం హెచ్చరిక.. మీ ఫోన్ వెంటనే అప్‌డేట్ చేసుకోండి.. లేదంటే జరిగేది ఇదే..!

3. కారు బుకింగ్ :
ఇప్పుడు చేయాల్సిందిల్లా.. కారును బుక్ చేయడం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. డీలర్‌షిప్ మీకు కారుతో కాంప్లిమెంటరీగా అందజేస్తానని వాగ్దానం చేసినా.. బుకింగ్ రసీదులో పేర్కొనండి. ఇది చాలా ముఖ్యమైనది. కాంప్లిమెంటరీ ప్రొడక్టులను బుకింగ్ రసీదులో పేర్కొనకపోతే.. డెలివరీ సమయంలో వాటిని మీ కారులో ఇన్‌స్టాల్ చేయడానికి డీలర్‌షిప్ నిరాకరించవచ్చు. ఇంకో విషయం.. బుకింగ్ రద్దు మొత్తాన్ని చెక్ చేయండి. ఇది బుకింగ్ రశీదులో ఉంటుంది. మీరు బుకింగ్‌ను రద్దు చేయాలని భావిస్తే.. డీలర్‌షిప్ ఎంత డబ్బును తిరిగి ఇస్తుందో తప్పక తెలుసుకోవాలి.

Buying a New Car, Keep these 5 things in mind

New Car Buying Guide : Buying a New Car, Keep these 5 things in mind

4. కొనుగోలు చేయడం :
మీ కారు డీలర్‌షిప్ వద్దకు వచ్చినప్పుడు, పూర్తిగా డెలివరీకి ముందు (PDI) చెక్చేయండి. కారు మీ పేరు మీద ఇంకా రిజిస్టర్ కాలేదని గుర్తుంచుకోండి. మీ కారులో ఏదైనా గీతలు ఉన్నాయా లేదా డ్యామేజ్ అయ్యాయా అని తెలుసుకోవడానికి ఇదే మీకు సరైన అవకాశం. ఎందుకంటే.. ఒకసారి రిజిస్ట్రేషన్ కోసం వెళితే కారులో ఏదైనా సమస్య ఉన్నా ఏం చేయలేమని గమనించాలి. PDI దశలో వాహనాన్ని తిరస్కరించడంతో పాటు మీ బుకింగ్‌ను రద్దు చేసే అధికారం కూడా మీకు ఉంటుంది. డీలర్‌షిప్ మీకు రీఫండ్ చేయమని గట్టిగా అడగవచ్చు. మీరు బీమా పాలసీతో సంతృప్తి చెందకపోతే.. పాలసీ ప్రొవైడర్‌ను మార్చమని మీరు ఎప్పుడైనా రిక్వెస్ట్ చేయొచ్చు. మీరు స్వతంత్రంగా కూడా బీమా చేసుకోవచ్చు.

5. బిగ్ డే డెలివరీ :
కారు డెలివరీ అనేది చాలా సమయం పట్టే ప్రక్రియ.. డీలర్‌షిప్‌లో నిర్దిష్ట రోజున రద్దీని బట్టి 3 గంటలు కూడా పట్టవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో, తాత్కాలిక నంబర్‌తో డ్రైవింగ్ చేయడం చట్టవిరుద్ధమని గమనించాలి. స్థానిక చట్టాలను తప్పకుండా చెక్ చేయండి. మీ డీలర్ మీకు అన్ని పేమెంట్ రసీదులు, ఒరిజినల్‌లోని ఇతర డాక్యుమెంట్లను అందజేసినట్లు నిర్ధారించుకోండి. అలాగే, డెలివరీ సమయంలో తయారీదారు అందించిన టూల్ కిట్‌తో పాటు కారులో తప్పనిసరిగా స్పేర్ వీల్ ఉందో లేదో చెక్ చేయండి.

అయినప్పటికీ, మీ వాహనం రన్-ఫ్లాట్ టైర్‌లపై నడుస్తుంటే.. తయారీదారు స్పేర్ పార్టును అందించకపోవచ్చు లేదా స్పేస్-సేవర్ వీల్‌ను అందించవచ్చు. కొనుగోలు సమయంలో డీలర్ ఆఫర్లు కారులో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. కొన్ని అంశాలు తక్షణమే అందుబాటులో ఉండకపోవచ్చు. మీరు అందుకోని అన్ని అప్లియన్స్ కు సంబంధించి నోట్ రాసి పెట్టుకోండి.

Read Also : OnePlus Nord 3 Launch : అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్.. లీకైన ఫీచర్లు ఏంటి? ధర ఎంత ఉండొచ్చుంటే?