Gautam Adani Richest Indian : భారత అత్యంత సంపన్నుడిగా అదానీ.. ఫోర్బ్స్‌ జాబితాలో అగ్రస్థానం.. నలుగురు తెలుగువారికి చోటు

భారత్ అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ నిలిచారు. ఫోర్బ్స్‌ భారతీయ కుబేరుడిగా అదానీ స్థానాన్ని సంపాదించుకున్నారు. దేశంలోని టాప్‌-100 సంపన్నుల జాబితా-2022లో రూ.12,11, 460.11 కోట్ల (150 బిలియన్‌ డాలర్లు)తో అదానీ గ్రూప్‌ సంస్థల అధిపతి గౌతమ్ అదానీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.

Gautam Adani Richest Indian : భారత అత్యంత సంపన్నుడిగా అదానీ.. ఫోర్బ్స్‌ జాబితాలో అగ్రస్థానం.. నలుగురు తెలుగువారికి చోటు

Gautam Adani

Gautam Adani Richest Indian : భారత్ అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ నిలిచారు. ఫోర్బ్స్‌ భారతీయ కుబేరుడిగా అదానీ స్థానాన్ని సంపాదించుకున్నారు. దేశంలోని టాప్‌-100 సంపన్నుల జాబితా-2022లో రూ.12,11, 460.11 కోట్ల (150 బిలియన్‌ డాలర్లు)తో అదానీ గ్రూప్‌ సంస్థల అధిపతి గౌతమ్ అదానీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ రూ.7,10,723.26 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. డీ-మార్ట్‌ అధినేత దమానీ రూ.2,22,908.66 కోట్లతో మూడో స్థానం దక్కించుకున్నారు.

దేశంలో రూ.15,350 కోట్ల కంటే ఎక్కువ సంపద కలిగిన వారితో ఫోర్బ్స్‌ జాబితాను రూపొందించింది. కేవలం ఒక్క ఏడాదిలోనే గౌతమ్‌ అదానీ సంపద రెట్టింపు కావడం గమనార్హం. గత ఏడాది కాలంలోనే అదానీ సంపద రూ.6 లక్షల కోట్లకుపైగా (75.2 బిలియన్‌ డాలర్లు) పెరిగింది. ఇది ముకేశ్‌ అంబానీ సంపదకు దాదాపు దగ్గర్లో ఉండటం నిజంగా చెప్పుకోదగ్గ అంశమే.

Gautam Adani : గౌతమ్ అదానీ నెం.1.. ఆసియాలోనే అపర కుబేరుడు.. అంబానీని వెనక్కి నెట్టేశాడుగా..!

కాగా, అదానీ సంపద 2014 నుంచే గణనీయంగా పెరిగింది. ప్రధానమంత్రి మోదీకి అత్యంత సన్నిహితుడిగా అదానీకి పేరున్న విషయం తెలిసిందే. ఇక 2014లోనే కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఓడరేవులు, విమానాశ్రయాలు, విద్యుదుత్పత్తి, విద్యుత్తు పంపిణీ, మీడియా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, గనులు, సిమెంట్‌, వంటనూనెలు తదితర రంగాల్లో అదానీ వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

ఇకపోతే తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురికి ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కింది. వీరిలో మురళీ దివీ అగ్రస్థానంలో ఉన్నారు. దివీస్ లాబోరేటరీస్ సంస్థ అధినేత మురళీ దివీ రూ.52,092.78 కోట్లతో 25వ స్థానంలో నిలిచారు. మేఘాఇంజినీరింగ్ సంస్థ అధిపతి పీపీ రెడ్డి రూ.33,113.24 కోట్లతో 43వ స్థానంలో ఉన్నారు.డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్ సంస్థ అధినేత సతీష్ రెడ్డి ఆండ్ కుటుంబం రూ.18,979.54 కోట్లతో 80వ స్థానాన్ని దక్కించుకున్నారు. అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి రూ.18,252.67 కోట్లతో 86 స్థానంలో ఉన్నారు.