అప్పులు ఇవ్వనున్న Google Pay అందరికి కాదు..వారికే

  • Published By: madhu ,Published On : June 26, 2020 / 09:02 AM IST
అప్పులు ఇవ్వనున్న Google Pay అందరికి కాదు..వారికే

ఏ సమాచారం కావాలన్నా..ఇచ్చే Google…పే క్రెడిట్ బిజినెస్ లో అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. చిన్న చిన్న పరిశ్రమలు నెలకొల్పేందుకు ఉత్సాహం చూపుతున్న వారికి హెల్ప్ చేయాలని Google యాజమాన్యం ఆలోచిస్తోంది. తక్షణమే అప్పు అడిగిన వారికి డబ్బులు సహాయం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

ఇందుకోసం భారతదేశంలోని టాప్ లెండర్స్ తో ఒప్పందం కుదుర్చుకొనే పనిలో పడింది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా 30 లక్షల మందికి ఇన్‌స్టంట్ క్రెడిట్ అంటే తక్షణమే అప్పు ఇచ్చే సదుపాయాన్ని ప్రారంభించనుంది. అంటే ప్రీ-అప్రూవ్డ్ పద్ధతిలో ఇది పనిచేస్తుంది. ఇప్పటికే కొన్ని బ్యాంకులతో కన్య్జూమర్ లోన్ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుందని తెలుస్తోంది.

వ్యాపారులకు రుణాలు ఇచ్చేందుకు భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నామని, గూగుల్ పేలో రుణాలు తీసుకోవచ్చని, ఈ రుణాలను ఆర్థిక సంస్థలు అందించడం..దరఖాస్తు ప్రక్రియపై వ్యాపారులకు పూర్తి నియంత్రణ ఉండేలా చూస్తామంటున్నారు అంబరీష్ (సీనియర్ డైరెక్టర్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, గూగుల్ పే). ఈ ఏడాది చివరి నాటికి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

Read: Popcorn ధరలు పెరుగుతున్నాయ్