Hero HF Deluxe Canvas Black : కొత్త బైకు కొంటున్నారా? హీరో HF డీలక్స్ స్పెషల్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్.. ధర ఎంతంటే?
Hero HF Deluxe Canvas : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? నాలుగు కలర్ ఆప్షన్లతో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్ వచ్చేసింది.

Hero HF Deluxe Canvas Black launched, four new colours added
Hero HF Deluxe Canvas Black launched : ప్రముఖ టూ వీలర్ తయారీ కంపెనీ హీరో మోటోకార్పొరేషన్ (Hero MotoCorp) భారత మార్కెట్లోకి Hero HF డీలక్స్ ప్రత్యేక కాన్వాస్ బ్లాక్ ఎడిషన్ (Canvas Black Edition)ను లాంచ్ చేసింది. ప్రసిద్ధ కమ్యూటర్ మోటార్‌సైకిల్‌ను నెక్సస్ బ్లూ, కాండీ బ్లేజింగ్ రెడ్, హెవీ గ్రే విత్ బ్లాక్, బ్లాక్ విత్ స్పోర్ట్స్ రెడ్ వంటి 4 కొత్త కలర్ ఆప్షన్లను కూడా అందిస్తుంది. హీరో HF డీలక్స్ కాన్వాస్ బ్లాక్-అవుట్ ఇంజన్, అల్లాయ్ వీల్స్, మఫ్లర్, ఫ్రంట్ ఫోర్క్, గ్రాబ్ రైల్‌తో ఆల్-బ్లాక్ థీమ్‌ను అందిస్తుంది.
Read Also L : Apple iPhone 13 Series : అత్యంత సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!
ఛార్జర్ కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. హీరో HF డీలక్స్‌లో 97.2cc ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్-సిలిండర్, OHC, BS6 (OBD-II కంప్లైంట్) PFI ఇంజన్ ‘XSens టెక్నాలజీ’, 5.9kW, 8.05Nm అందిస్తుంది. హీరో HF డీలక్స్ 9.6-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్‌ను కలిగి ఉంది. దీని బరువు 112 కిలోలు. 733mm పొడవైన సీటు, 2 ఫేస్ ఎడ్జిస్ట్ సస్పెన్షన్, అల్లాయ్ వీల్స్ కలిగి ఉంది.

Hero HF Deluxe Canvas Black launched, four new colours added
ఇతర ఫీచర్లలో ట్యూబ్‌లెస్ టైర్లు, సైడ్ స్టాండ్ ఇండికేటర్, క్రోమ్ లెగ్ గార్డ్, టో గార్డ్ ఉన్నాయి. మోటార్‌సైకిల్‌కు ప్రామాణిక ఐదేళ్ల వారంటీతో పాటు 5 ఉచిత సర్వీసులను అందిస్తుంది. వేరియంట్‌ల వారీగా హీరో HF డీలక్స్ ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ). హీరో HF డీలక్స్ డ్రమ్ కిక్ కాస్ట్ ధర రూ. 60,760 ఉండగా, హీరో HF డీలక్స్ డ్రమ్ సెల్ఫ్ కాస్ట్ ధర రూ. 66,408, Hero HF డీలక్స్ i3S డ్రమ్ సెల్ఫ్ కాస్ట్ ధర రూ. 67,908, హీరో HF డీలక్స్ గోల్డ్ బ్లాక్ D ధర రూ. 67,208 నుంచి అందుబాటులో ఉంటుంది.