Zomato Delivery: పది నిముషాల్లో ఫుడ్ డెలివరీ? జొమాటోకు ఇది ఎలా సాధ్యం?

సాధారణంగా నిత్యావసరాలు, ప్యాక్డ్ ఫుడ్ వంటి ఉత్పత్తులను 10 నిమిషాల్లో డెలివరీ చేయొచ్చు. కానీ వండి ఉడికించే వేడివేడి ఆహారాన్ని పది నిముషాల్లో డెలివరీ చేయడం సాధ్యపడే విషయంకాదు

Zomato Delivery: పది నిముషాల్లో ఫుడ్ డెలివరీ? జొమాటోకు ఇది ఎలా సాధ్యం?

Zomato

Zomato Delivery: ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఇటీవల సంచలన ప్రకటన చేసింది. వినియోగదారులు ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇకపై పది నిముషాల్లోనే డెలివరీ చేస్తామంటూ ఆ ప్రకటన సారాంశం. సాధారణంగా నిత్యావసరాలు, ప్యాక్డ్ ఫుడ్ వంటి ఉత్పత్తులను 10 నిమిషాల్లో డెలివరీ చేయొచ్చు. కానీ వండి ఉడికించే వేడివేడి ఆహారాన్ని పది నిముషాల్లో డెలివరీ చేయడం సాధ్యపడే విషయంకాదు. ముఖ్యంగా భారతీయ సాంప్రదాయ వంటకాలను సిద్ధం చేయాలంటే కనీసం 20-30 నిముషాల సమయం పడుతుంది. అటువంటిది పది నిముషాల్లోనే ఆహారాన్ని మన ముందు ఉంచడం సాధారణ విషయం కాదు. జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయెల్ చేసిన ఈప్రకటనపై అటు సంస్థలోని తోటి సభ్యులు సహా పరిశ్రమ వర్గాలు కూడా పెదవి విరిచారు. ఇదేదో మార్కెటింగ్ ప్రచార జిమ్మిక్ గా భావించారు. అయితే జొమాటోలో పది నిముషాల్లో ఫుడ్ డెలివరీ ఎలా సాధ్యపడుతుందో తెలుపుతూ దీపిందర్ మంగళవారం ట్విట్టర్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు. దీపిందర్ తెలిపిన వివరాలు మేరకు..

Also Read:Petrol Price Hike: పెట్రోల్ ధరల పెంపు: బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎటాక్

10 నిమిషాల ఫుడ్ డెలివరీ సర్వీస్ ప్రధానంగా ఎంపిక చేసిన ఆహార పదార్థాలు(Food Menu) మరియు నిర్దిష్ట కస్టమర్ లొకేషన్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం ఆయా లొకేషన్లలో పూర్తి మోడ్రెన్ పద్దతిలో ఆహార కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వినియోగదారుల డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో..డెలివరీ బాయ్స్ ఎక్కువ అందుబాటులో ఉండి..ముందుగా ఎంపికచేసిన ఐటమ్స్ ను మాత్రమే ఈ పది నిముషాల డెలివరీలో పొందుపరుస్తారు. అదేవిధంగా.. ఏ ఏ వంటకాలపై ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయో ముందుగానే గుర్తించి..ఆయా వంటకాలపై తరువాతి ఆర్డర్లు ఏ విధంగా ఉంటాయో పసిగట్టేలా ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను వినియోగిస్తున్నారు. తద్వారా ఆర్డర్ వచ్చిరాగానే ఆ వంటకాన్ని సిద్ధం చేసి ఉంచుతారు. ఇప్పటికే అటువంటి 20-30 వంటకాలను ఈ లిస్టులో చేర్చింది జొమాటో.

Also read: Maharashtra : రైతుల భక్తి.. 2,000 కిలోల ద్రాక్షపండ్ల‌తో గణేషుడికి అలంక‌ర‌ణ‌

అన్నిటికంటే ప్రధానంగా టైం వినియోగాన్ని తగ్గించి త్వరగా సిద్ధం చేయగలిగిన మ్యాగీ, పోహా, బ్రెడ్ ఆమ్లెట్, పోహా, కాఫీ, చాయ్, బిర్యానీ, మోమోస్ మొదలైన వంటకాలను ఈ 10 నిముషాల డెలివరీ ద్వారా వినియోగదారులకు అందించనున్నారు. ఈ పది నిముషాల్లో కిచెన్ సమయం(వండే సమయం) 2-4 నిముషాలు, డెలివరీ సమయం(ట్రావెలింగ్) 3-6 నిముషాల వ్యవధిలో 1-2 కిలోమీటర్ల పరిధి ఉండేలా చూసుకుంటారు. ఇక పది నిముషాల డెలివరీలో ఫుడ్ క్వాలిటీ ఏ మాత్రం తేడా రాకుండా, డెలివరీ బాయ్స్ రోడ్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని కొన్ని కీలక మార్పులు చేసింది జొమాటో. ఇక ఈ పది నిముషాల డెలివరీ సర్వీసును పైలట్ ప్రాజెక్టుగా ప్రధానంగా నాలుగు నగరాల్లో అమలు చేయనున్నారు.

Also Read: Zomato App: పది నిమిషాల్లో ఫుడ్ డెలివరీ..