యుద్ధ మేఘాలు : పెట్రోల్ దాచుకోవాల్సిందేనా!

  • Published By: madhu ,Published On : January 8, 2020 / 08:37 AM IST
యుద్ధ మేఘాలు : పెట్రోల్ దాచుకోవాల్సిందేనా!

ఇక పెట్రోల్ దాచుకోవాల్సిందేనా ? మున్ముందు మరింతగా రేట్లు పెరుగుతాయా ? లేక పెట్రోల్ కొరత రావచ్చా ? ఇలా..అనేక ప్రశ్నలు ప్రజల మదిలో మెదులుతున్నాయి. ఎందుకంటే..అమెరికా..ఇరాన్..దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరాన్‌కు చెందిన ఆర్మీ సుప్రీం కమాండర్ సులేమానిని డ్రోన్స్ సహాయంతో అమెరికా అంతమొందించిన సంగతి తెలిసిందే. దీని ఇరాన్ దేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. ఘర్షణతో పశ్చిమాసియాలో తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి.

చమురు ఉత్పత్తులు ఎక్కువగా ఇరాన్, ఇరాక్ దేశాల్లో ఉన్న సంగతి తెలిసిందే. దెబ్బకు దెబ్బ కొడుతామని ఇరాన్ ప్రకటించింది. సులేమాని అంత్యక్రియలు ముగిసిన వెంటనే..అమెరికన్ ఎయిర్ బేస్ మీదకు దాడికి పాల్పడింది. ఈ మిస్సైల్స్ దాడుల్లో 80 మంది అమెరికన్ సైన్యం మరణించినట్లుగా వెల్లడిస్తోంది. ఇదంతా ఒక వైపు పెడితే..ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ రేట్లు అధికమౌతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 30 శాతం చమురు పశ్చిమాసియా నుంచి వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రపంచంలో చమురుకు భారీ డిమాండ్ ఉంది. మార్కెట్లో అంతకంటే ఎక్కువగానే డిమాండ్ ఉంటుంది.

పశ్చిమాసియాలో మూడు పెద్ద ఎగుమతి దేశాలైనా సౌది అరేబియా, కువైత్, ఇరాక్ నుంచి హర్మూజ్ ద్వారా బయటకు వెళుతుంది. ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకుంటుండడంతో మిగతా దేశాల చమురును ఇరాన్ అడ్డుకొనే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు పెద్ద ఆటంకం ఏర్పడుతుందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 
అమెరికా, రష్యా నుంచి చమురు భారత్ దిగుమతి చేసుకొంటుండగా..పశ్చిమాసియా దేశాల నుంచి భారత్ చమురును కొనుగోలు చేస్తుంటుంది. అయితే..చమురు సరఫరాకు అడ్డంకులు వచ్చినా..భారత్‌లో ఎలాంటి ఆందోళన పడాల్సినవసరం లేదని, కానీ ధరలు పెరిగే అవకాశాలు ఉండవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

దేశ అవసరాల కోసం 85 శాతం చమురు దిగుమతి చేసుకొంటోంది. క్రమేణా..చమురు డిమాండ్ పెరగుతోంది. ప్రతి సంవత్సరం 4 నుంచి 5 శాతం పెరుగుతోందని, అంతేగాకుండా..వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది. చమురుతో పాటు గ్యాస్ కూడా దిగుమతి చేసుకొంటోంది ఇండియా. పశ్చిమాసియాలో ఎలాంటి ఘటనలు ఎప్పడు జరిగినా..భారత్‌పై ప్రభావం చూపిస్తుంటుంది. భారత్‌లో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు క్రమేపి పెరుగుతున్నాయి. బంగారం కూడా అదేదారిలో వెళుతోంది. చమురు ధరలు పెరిగితే..మాత్రం..దీనిపై ఆధారపడిన వస్తువులు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Read More : ఆవేశంగా మాట్లాడుతూ..మధ్యలోనే ప్రసంగం ఆపేసిన నారా లోకేష్..ఎందుకు