iQOO Neo 7 Pro India Launch : జూలై 4న ఐక్యూ నియో 7 ప్రో వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

iQOO Neo 7 Pro India Launch : ఐక్యూ (iQOO) నియో 7 ప్రో నథింగ్ ఫోన్ (2)కి పోటీగా వస్తోంది. వచ్చే నెలలో భారత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది.

iQOO Neo 7 Pro India Launch : జూలై 4న ఐక్యూ నియో 7 ప్రో వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

iQOO Neo 7 Pro India Launch on July 4 _ Everything we know so far

iQOO Neo 7 Pro India Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ ఐక్యూ (iQOO India) ఇండియా కొత్త iQOO నియో 7 ప్రోని జూలై 4న లాంచ్ చేయనుంది. అధికారిక లాంచ్‌కు ముందు.. ఈ స్మార్ట్‌ఫోన్ అధికారిక డిజైన్, కీలక స్పెసిఫికేషన్‌లను కంపెనీ వెల్లడించింది. ముందుగా, అధికారిక iQOO నియో 7 ప్రో ఆరెంజ్ కలర్ ఆప్షన్ వెల్లడించనుంది. అయితే, బ్లాక్ కలర్ ఆప్షన్ కూడా ఉండవచ్చు. రాబోయే ఈ ఫోన్‌కు సంబంధించి (iQOO 11) లెజెండ్ (BMW మోటార్‌స్పోర్ట్ ఎడిషన్)లో ఫాక్స్ లెదర్ బ్యాక్‌ను అందించనుంది. Qualcomm స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCతో కూడా వస్తుంది. ఈ ఫోన్ నియో 7 5Gలో డైమెన్సిటీ 8200 SoC కన్నా గణనీయమైన అప్‌గ్రేడ్ కలిగి ఉండనుంది.

iQOO స్మార్ట్‌ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుందని వెల్లడించింది. అయినప్పటికీ, బ్యాటరీ సామర్థ్యంపై క్లారిటీ ఇవ్వలేదు. కేవలం 8 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్ సమయం ఉంటుందని కంపెనీ తెలిపింది. ఫుల్ ఛార్జీకి 30 నిమిషాల కన్నా తక్కువ సమయం పట్టవచ్చు. అదనంగా, (iQOO Neo 7 Pro) ఇండిపెండెంట్ గేమింగ్ చిప్ (IG చిప్)ని గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది. ఐక్యూ యూజర్ల కోసం గేమ్‌లతో మోషన్ కంట్రోల్ ఫీచర్ కూడా అందిస్తోంది.

Read Also : KTM 200 Duke 2023 : ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌తో కొత్త కేటీఎం 200 డ్యూక్ 2023 బైక్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

iQOO కెమెరా, డిస్‌ప్లే, ఇతర ఫీచర్ల గురించి వివరాలను వెల్లడించలేదు. అయినప్పటికీ, ఫోన్ iQOO నియో 7 రేసింగ్ ఎడిషన్ రీబ్రాండెడ్ వెర్షన్ అని నివేదిక పేర్కొంది. గత ఏడాదిలో చైనాలో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఊహాగానాలు నిజమైతే.. iQOO Neo 7 Pro ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 8MP అల్ట్రావైడ్ కెమెరా, వెనుకవైపు 2MP మాక్రో కెమెరా సెన్సార్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో వస్తుందని భావించవచ్చు. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉండవచ్చు. ఫుల్ HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల AMOLED ఫ్లాట్ డిస్‌ప్లే ఉండవచ్చు.

iQOO Neo 7 Pro India Launch on July 4 _ Everything we know so far

iQOO Neo 7 Pro India Launch on July 4 _ Everything we know so far

Android 13-ఆధారిత Funtouch OS 13 5G, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఛార్జింగ్ USB టైప్-C పోర్ట్, డ్యూయల్-సిమ్, Wi-Fi 6, బ్లూటూత్ 5.3, స్టీరియో స్పీకర్లు, 16GB వరకు RAM+ వంటి ఇతర ముఖ్య అంచనా ఫీచర్లు ఉన్నాయి. అధికారిక ప్రారంభానికి ముందు.. 256GB స్టోరేజీ వివరాలు అస్పష్టంగానే ఉన్నాయి. అమెజాన్ పే (Amazon Pay) బ్యాలెన్స్‌గా యూజర్లు రూ. 10వేల వరకు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని ఐక్యూ పేర్కొంది. అమెజాన్‌లో (iQOO Neo 7 Pro) లేటెస్ట్ అప్‌డేట్స్ పొందడానికి నోటిఫికేషన్ ఆప్షన్ ఎంచుకోండి.

స్పెసిఫికేషన్ల ప్రకారం వెళితే.. iQOO నియో 7 ప్రో ధర సుమారు రూ. 45వేలు ఉండవచ్చు. యూకే ఆధారిత టెక్ కంపెనీ నథింగ్ కూడా అదే (Qualcomm SoC)తో నథింగ్ ఫోన్ (2)ని లాంచ్ చేసేందుకు సన్నాహాలు వస్తోంది. ఈ ఫోన్ ధర ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా ఉంటుంది. అదే SoC ఉన్న ఇతర స్మార్ట్‌ఫోన్‌లలో మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా రూ. 49,999, OnePlus 10T 5G రూ. 54,999 ఉన్నాయి.

Read Also : Maruti Suzuki Invicto : మారుతి సుజుకి ఇన్విక్టో బుకింగ్స్ ఓపెన్.. జూలై 5నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?