IT Jobs Cut : ఊడుతున్న ఉద్యోగాలు.. ఐటీ ఉద్యోగులకు గడ్డు కాలం, ముందు ముందు మరింత దారుణం.. కోతలకు కారణం అదేనా?

ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగాల కోతలు పెరుగుతున్నాయి. టెక్కీలను టెన్షన్ పెట్టే వార్తలు రోజుకొకటి వస్తున్నాయి. అతిపెద్ద ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ ఏకంగా 11వేల మందికి గుడ్ బై చెబుతూ ఉండటం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కేవలం 1,940 మంది ఉద్యోగులను మాత్రమే భర్తీ చేశాయి భారత్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలు.

IT Jobs Cut : ఊడుతున్న ఉద్యోగాలు.. ఐటీ ఉద్యోగులకు గడ్డు కాలం, ముందు ముందు మరింత దారుణం.. కోతలకు కారణం అదేనా?

IT Jobs Cut : ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగాల కోతలు పెరుగుతున్నాయి. టెక్కీలను టెన్షన్ పెట్టే వార్తలు రోజుకొకటి వస్తున్నాయి. అతిపెద్ద ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ ఏకంగా 11వేల మందికి గుడ్ బై చెబుతూ ఉండటం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కేవలం 1,940 మంది ఉద్యోగులను మాత్రమే భర్తీ చేశాయి భారత్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలు.

ఐటీ ఉద్యోగాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతకు ప్రస్తుత పరిస్థితులు నిరాశ కలిగిస్తున్నాయి. దిగ్గజ కంపెనీలు ఉద్యోగాలపై కోత విధిస్తుండటంతో.. యువత భవిష్యత్తు ఆందోళనకరంగా మారింది. ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ కొత్త ఏడాదిలోనూ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు ట్విట్టర్, మెటా, అమెజాన్.. వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. తాజాగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఈ జాబితాలో చేరింది.

మైక్రోసాఫ్ట్.. తన మొత్తం కంపెనీ ఉద్యోగుల్లో 5శాతం మందిని తొలగించేందుకు సిద్ధమైంది. అంటే సుమారు 11వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించనున్నట్లు తెలుస్తోంది. మానవ వనరులు, ఇంజినీరింగ్ విభాగాల్లో ఉద్యోగాలను తగ్గించాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయం తీసుకుంది.

Also Read..Amazon Lay Off Employees : ఉద్యోగులను తొలగిస్తున్న అమెజాన్.. భారత్ లో 1000 మంది

వాషింగ్టన్ కేంద్రంగా పని చేస్తున్న మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆదాయం తగ్గుతూ ఉండటంతో అక్కడే కోతలు ఎక్కువగా ఉండే చాన్స్ కనిపిస్తోంది. 26 అంతస్తుల సిటీ సెంటర్ ప్లాజాలో ఉన్న ఈ ఆఫీస్ లీజుని కూడా పునరుద్దరించడం లేదని సమాచారం.

మైక్రోసాఫ్ట్ కంపెనీ 2022 జూలైలోనే కొంతమంది ఉద్యోగులను తొలగించింది. 2022 అక్టోబర్ లోనూ సుమారు వెయ్యి మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. గతేడాది జూన్ 30 నాటికి మైక్రోసాఫ్ట్ లో 2లక్షల 21వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. లక్షా 22 వేల మంది అమెరికాలో, 99వేల మంది ఇతర దేశాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.

Also Read..Indian Employees: ఇండియాలో ఉద్యోగులకు 15-30 శాతం పెరగనున్న వేతనాలు.. తాజా సర్వే వెల్లడి

వచ్చే రెండేళ్ల పాటు కంప్యూటర్ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతోందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇప్పటికే హెచ్చరించారు. గ్లోబల్ పరిణామాలకు మైక్రోసాఫ్ట్ కూడా అతీతం కాదన్నారాయన. అటు భారత్ లోనూ ఐటీ కంపెనీలు నియామకాలను తగ్గించుకుంటున్నాయి. టాప్ -4 కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్.. మూడో త్రైమాసికంలో కేవలం 1,940 మంది ఉద్యోగులను మాత్రం రిక్రూట్ చేసుకున్నాయి. అంటే, గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు నియామకాలను 97శాతానికి తగ్గించాయి. 11 త్రైమాసికాలతో పోల్చి చూస్తే ఇదే అతి తక్కువ రిక్రూట్ మెంట్.

ఈ 4 బడా కంపెనీలు 2022 మూడవ త్రైమాసికంలో అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు 61వేల 137 మందిని నియమించాయి. డిసెంబర్ 2022 చివరి నాటికి టీసీఎస్ లో మొత్తం ఉద్యోగుల్లో 2వేల 197మంది తగ్గిపోగా.. ఇదే సమయంలో బెంగళూరులోని విప్రోలో 435 మంది ఉద్యోగులు తగ్గారు. ఐటీ నియామకాల్లో ఇది బలహీనమైన కాలంగా చెబుతున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

6 నెలల క్రితం మొదలైన ఈ మందగమనం రానున్న నెలల్లో మరింతగా విస్తరించే అవకాశం ఉందని నియామక సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరతలు, మాంద్యం భయాలు నెలకొన్నాయి. దీంతో ఐటీ కంపెనీలన్నీ ఖర్చు తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే భారీగా ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయన్నది ఐటీ నిపుణుల విశ్లేషణ.