Meta Layoff: మరో పదివేల మందిని తొలగించనున్న ‘మెటా’.. వెల్లడించిన జుకర్ బర్గ్

వివిధ విభాగాల్లో పని చేస్తున్న పది వేల మంది సిబ్బందిని అనేక దశల్లో తొలగించబోతున్నట్లు చెప్పాడు. అలాగే కొన్ని ప్రాజెక్టుల్ని రద్దు చేస్తున్నట్లు, ఉద్యోగ నియామకాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే కంపెనీలో ఖాళీగా ఉన్న 5,000 ఉద్యోగాల నియామకం కూడా చేపట్టబోవడం లేదన్నారు.

Meta Layoff: మరో పదివేల మందిని తొలగించనున్న ‘మెటా’.. వెల్లడించిన జుకర్ బర్గ్

Meta Layoff: త్వరలో పదివేల మంది ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్లు ‘ఫేస్‌బుక్’ మాతృ సంస్థ ‘మెటా’ సీఈవో జుకర్ బర్గ్ వెల్లడించాడు. ఈ విషయంపై ఇప్పటికే ఆయన తన కంపెనీలోని ఉద్యోగులకు సమాచారం అందించాడు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న పది వేల మంది సిబ్బందిని అనేక దశల్లో తొలగించబోతున్నట్లు చెప్పాడు.

Rains In Telangana: తెలంగాణలో మోస్తరు వర్షాలు.. మూడు రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే..

అలాగే కొన్ని ప్రాజెక్టుల్ని రద్దు చేస్తున్నట్లు, ఉద్యోగ నియామకాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే కంపెనీలో ఖాళీగా ఉన్న 5,000 ఉద్యోగాల నియామకం కూడా చేపట్టబోవడం లేదన్నారు. నాలుగు నెలల క్రితమే కంపెనీ 11,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఉద్యోగుల తొలగింపు నిర్ణయం కఠినమైందే అయినప్పటికీ, మరో ప్రత్యామ్నాయం లేదని జుకర్ బర్గ్ వివరించారు. ఎంతో ప్రతిభ, ఉత్సాహం కలిగి, తమ సంస్థ విజయానికి కారణమైన వారిని వదులుకోవాల్సి వస్తుందని ఆయన తన ఫేస్ బుక్ ఖాతాలో వెల్లడించారు. తన సంస్థ కోసం పని చేసిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు.

జుకర్ బర్గ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ చివరి వారం నుంచి మలిదశ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మొదలవుతుంది. ఏప్రిల్‌లో టెక్ గ్రూప్, మేలో బిజినెస్ గ్రూప్ ఉద్యోగుల్ని తొలగిస్తారు. సంస్థలో పాతికశాతంపైగా ఉద్యోగుల్ని తొలగించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీలోని కొందరు సీనియర్లు ఈ ప్రక్రియలో పాలుపంచుకుంటారు.