One Moto Global : ఇండియాకు యూకే రెండు EV స్కూటర్లు.. బుకింగ్స్ ప్రారంభం!

One Moto Global : యూకేకు చెందిన ఎలక్ట్రిక్‌ వెహికల్స్ సంస్థ వన్ మోటో గ్లోబల్‌ (One Moto Global) భారత మార్కెట్లలోకి అడుగుపెట్టింది. ఆటోమోటివ్స్ ఇండియాలో వన్ మోటోను లాంచ్ చేసింది.

One Moto Global : ఇండియాకు యూకే రెండు EV స్కూటర్లు.. బుకింగ్స్ ప్రారంభం!

One Moto Global To Launch Its First Two Electric Scooters In India Tomorrow

One Moto Global : యూకేకు చెందిన ఎలక్ట్రిక్‌ వెహికల్స్ సంస్థ వన్ మోటో గ్లోబల్‌ (One Moto Global) భారత మార్కెట్లలోకి అడుగుపెట్టింది. ఇండియన్ స్టార్టప్ ఎలైసియం ఆటోమోటివ్స్ ఇండియాలో వన్ మోటోను లాంచ్ చేసింది. తమ కంపెనీ మొదటి రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లలో బైకా, కామ్యూటా అనే మోడల్స్ లాంచ్ చేసింది. ఈ బైక్స్‌ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీ, మొబిలీటీ ట్రాకింగ్‌, బ్యాటరీ స్వాప్‌ ఆప్షన్లతో వస్తున్నాయి. వన్ మోటో గ్లోబల్‌ ఇండియా హైదరాబాద్‌‌‌‌ నగరంలో అధికారికంగా తమ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది.

కమ్యూటా (Commuta) బైక్‌ 80 కిలోమీటర్ల రేంజ్ గల ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది.. దీని కనీస ప్రారంభ ధర రూ.130,000 కంపెనీ నిర్ణయించింది. బైకా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ 4000kw శక్తివంతమైన బాష్ మోటార్ సాయంతో పనిచేస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే.. 150 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లగలదు. ప్రస్తుతం కమ్యూటా బైక్స్ కంపెనీ వెబ్‌సైట్లో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల వినియోగదారులు రూ. 1111 అమౌంట్‌ చెల్లించి ప్రి-బుక్‌ చేసుకోవచ్చు. 2022 జనవరిలో ఈ కొత్త బైకులను కంపెనీ కొనుగోలుదారులకు డెలివరీ చేయనుంది. ఈ రెండు బైకుల్లో ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

బైకా ఫీచర్లు :
వన్ మోటో బైకా EV స్కూటర్‌ 3.3 సెకన్లలో 0-50కిలమీటర్ల వేగాన్ని అందుకోగలదు. టాప్ స్పీడ్ 85కిలోమీటర్లు. ఒకసారి ఛార్జ్ చేస్తే 150కిలోమీటర్ల వరకు దూసుకెళ్లగలదు. ఇక ఫుల్ ఛార్జింగ్ అయ్యే సమయం 4 గంటలు పడుతుంది.

కమ్యూటా ఫీచర్లు :
కమ్యూటా మోడల్ బైక్‌.. గంటకు 55 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 80కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఇక ఛార్జింగ్‌ సమయం 4 గంటలు పెట్టాల్సి ఉంటుంది.

Read Also : TTD Accommodation : తిరుపతిలో చిక్కుకుపోయిన భక్తులకు టీటీడీ వసతి ఏర్పాటు