షాకింగ్ న్యూస్ :  PAN – Aadhaar card లింక్ లేకపోతే..10 వేలు ఫైన్

  • Published By: madhu ,Published On : March 2, 2020 / 08:22 AM IST
షాకింగ్ న్యూస్ :  PAN – Aadhaar card లింక్ లేకపోతే..10 వేలు ఫైన్

అవును నిజంగానే..ఇది షాకింగ్ న్యూసే..PAN – Aadhaarకు లింక్ లేకపోతే..10వేల రూపాయల ఫైన్ వేసే ఛాన్స్ ఉంది. మార్చి 31 లోపల PAN – Aadhaarకు లింక్ చేయాలని డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. అప్పటికీ ఒకవేళ చేయలేకపోతే..ఆదాయపన్ను శాఖ (Income Tax) రూ. 10 వేలు జరిమాన విధించవచ్చు. లింక్ చేయని అన్ని పాన్ కార్డులను ‘పనిచేయనవి’గా ప్రకటిస్తామని ఆ శాఖ వెల్లడించింది. 

పాన్ హోల్డర్స్ ఆదాయపు పన్ను చట్టం ప్రకారం..పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని విడుదల చేసిన కొత్త నొటిఫికేషన్‌లో వెల్లడించింది. చట్ట ప్రకారం.. పాన్ ఇవ్వబడదని, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272 బి ప్రకారం..రూ. 10 వేలు ఫైన్ వేసే అవకాశం ఉందని బ్యాంక్ బజార్ (Bank Bazar) CEO ఆదిషెట్టి వెల్లడించారు. పనిచేయని పాన్ కార్డును ఉపయోగించి బ్యాంకు ఖాతా తెరవడం..లావాదేవీలను కలిగి ఉంటే..సమస్యలు రావచ్చొన్నారు. పాన్ కార్డును ఐడెంటిటీ ప్రూఫ్‌గా ఉపయోగించవచ్చు. 

బ్యాంకు అకౌంట్ ఓపెనింగ్, డ్రైవింగ్ లెసెన్స్ కోసం అప్లై చేసుకోవడానికి పాన్ కార్డును ఉపయోగించవచ్చు. కానీ.బ్యాంకు అకౌంట్ తెరిచేందుకు పాన్ నెంబర్ ఉపయోగిస్తే..కొన్ని ఇబ్బందులను రావచ్చంటున్నారు. ఉదాహరణకు బ్యాంక్ నుంచి రూ. 50 వేలకు పైన డబ్బులు విత్ డ్రా చేసినా..లేదంటే..బ్యాంకులో డిపాజిట్ చేసిన పాన్ నెంబర్ అవసరం ఉంటుంది. అప్పుడు సమస్య రావొచ్చంటున్నారు. PAN – Aadhaar గడువు తర్వాత లింక్ చేసుకుంటే…మళ్లీ కొత్తగా పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే పాన్ కార్డు పనిచేస్తుంది. 

CBDT ఆధార్, పాన్ అనుసంధాన గడువును పొడించిన సంగతి తెలిసిందే. లింక్ డిసెంబర్ 31గా ఉంది. ఇప్పుడు ఈ డెడ్ లైన్‌ను 2020 మార్చి 31 వరకు పొడిగించారు. జనవరి 27 నాటికి చూస్తే దేశంలో 30.75 కోట్లకు పైగా పాన్ కార్డులు ఆధార్ కార్డులతో లింక్ అయినట్లు అంచనా. సో…ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే..సమస్యలు రావచ్చు..వెంటనే..లింక్ చేసుకోండి..సమస్యలు రాకుండా చూసుకోండి.