Paytm Transit Card : పేటీఎం ఆల్ ఇన్-వన్ కార్డు.. అన్ని ట్రాన్సాక్షన్లకు ఒకే కార్డు!
పేటీఎం (Paytm) యూజర్లకు గుడ్ న్యూస్. ఇకపై అన్ని పేమెంట్లు ఒకే కార్డుతో వినియోగించుకోవచ్చు. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు కొత్త కార్డును లాంచ్ చేసింది.

Paytm Payments Bank Launches Paytm Transit Card
Paytm Transit Card : ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్ధ పేటీఎం (Paytm) యూజర్లకు గుడ్ న్యూస్. ఇకపై అన్ని పేమెంట్లు ఒకే కార్డుతో వినియోగించుకోవచ్చు. ఇందుకోసం పేటీఎం పేమెంట్స్ బ్యాంకు (Paytm Payments Bank) కొత్త కార్డును లాంచ్ చేసింది. అదే.. Paytm Transit Card. ఈ ట్రాన్సిట్ కార్డుతో మెట్రో సర్వీసులు, రైల్వే, ప్రభుత్వ బస్సులు, మర్చంట్ స్టోర్, టోల్ పార్కింగ్ ఛార్జీలు, ఆన్‌లైన్ షాపింగ్ కోసం వాడొచ్చు. అంతేకాదు.. ట్రాన్సిట్ కార్డు సాయంతో ఏటీఎం నుంచి కూడా డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు.
ఈ పేటీఎం ట్రాన్సిట్ కార్డు.. పేటీఎం వ్యాలెట్‌తో డైరెక్టుగా లింక్ చేసి ఉంటుంది. అలాగే.. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లను మరింత మరింత ఈజీగా ఉండేందుకు ఈ ట్రాన్సిట్ కార్డును పేటీఎం లాంచ్ చేసింది. ఈ మేరకు పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కార్డు కావాలంటే పేటీఎం యాప్ ద్వారా అప్లయ్ చేసుకున్న యూజర్లకు అందించనుంది. కార్డు ట్రాన్సిట్ కోసం అప్లయ్ చేసిన తర్వాత అది నేరుగా ఇంటికే డెలివరీ చేయనుంది కంపెనీ.
పేటీఎం పేమెంట్స్ ప్రకటన ప్రకారం.. పేటీఎం ట్రాన్సిట్ కార్డ్ (Paytm Transit Card)ను దేశవ్యాప్తంగా మెట్రోలతో పాటు ఇతర మెట్రో స్టేషన్‌లలో కూడా వినియోగించుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ట్రాన్సిట్ కార్డు.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్, అహ్మదాబాద్ మెట్రో లైన్లలో మాత్రమే వర్క్ అవుతుంది. హైదరాబాద్ మెట్రోరైలు సర్వీసుల్లో కూడా ఈ పేటీఎం ట్రాన్సిట్ కార్డును తీసుకొచ్చే ఛాన్స్ ఉంది.
Read Also : Indians : గూగుల్ నుంచి ట్విట్టర్ వరకు అంతా మనోళ్లే..!