PollCheck Election 2023 : జర్నలిస్టులకు గూగుల్ న్యూస్ ఇనీషియేటివ్ ట్రైనింగ్.. పోల్‌చెక్ ఎలక్షన్ అకాడమీ 2023 మొదటి సెషన్..!
PollCheck Election 2023 : జర్నలిస్టుల కోసం ప్రత్యేకించి గూగుల్ ఇనీషియేటివ్ ఇండియా ట్రైనింగ్ ప్రొగ్రామ్‌లో భాగంగా పోల్‌చెక్ ఎలక్షన్ అకాడమీ 2023 మొదటి సెషన్ నిర్వహించింది.

PollCheck Election Academy 2023, digital training series for journalists covering upcoming elections in India
PollCheck Election 2023 : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ న్యూస్ (Google News) ఇనీషియేటివ్ ఇండియా ట్రైనింగ్ నెట్‌వర్క్ డేటాలీడ్స్(DataLEADS), ఇన్ ఓల్డ్ న్యూస్(In Old News) సహకారంతో హైదరాబాద్‌లోని సెయింట్ మేరీస్ కాలేజీలో (PollCheck Election 2023) మొదటి సెషన్‌ను నిర్వహించింది. ఇందులో భాగంగా.. జర్నలిస్టులను అధునాతన ఎన్నికల రిపోర్టింగ్ నైపుణ్యాలతో తీర్చిదిద్దేందుకు ట్రైనింగ్ ప్రొగ్రామ్ ముగిసింది.
తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్ వంటి 5 రాష్ట్రాలలో పోల్‌చెక్ ఎలక్షన్ అకాడమీ 2023 ట్రైనింగ్ ప్రొగ్రామ్ నిర్వహించింది. రాబోయే కొద్ది నెలల్లో భారత్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జర్నలిస్టులు, న్యూస్‌రూమ్‌లకు అవసరమైన టూల్స్, స్కిల్స్ పొందడానికి సరికొత్త స్టోరీలను అందించడానికి సహకరిస్తుంది. అత్యంత అనుభవం కలిగిన జర్నలిస్టుల నేతృత్వంలో ఈ సెషన్ నిర్వహించగా.. ఆన్‌లైన్ వెరిఫికేషన్, డిజిటల్ సేఫ్టీ, వీడియో స్టోరీటెల్లింగ్, న్యూస్ ఫర్ న్యూస్, డేటా జర్నలిజం, మీడియా లిటరసీ వంటి అంశాలపై చర్చించారు.
హైదరాబాద్‌లో (PollCheck 2023) సెషన్‌లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎడిటర్ (ఇన్వెస్టిగేషన్), GNI-ఇండియా ట్రైనింగ్ నెట్‌వర్క్ ట్రైనర్ సుధాకర్ రెడ్డి ఉడుముల డిజిటల్ ఇన్వెస్టిగేషన్, వెరిఫికేషన్‌పై మాట్లాడారు. ఇన్ ఓల్డ్ న్యూస్ సహ-వ్యవస్థాపకులు సంషే బిస్వాస్, మనోన్ వెర్చోట్ ఎన్నికల సమయంలో వీడియో స్టోరీ టెల్లింగ్ వంటి అంశాలపై వివరణ ఇచ్చారు.

PollCheck Election Academy 2023, digital training series for journalists covering upcoming elections in India
ఎన్నికల కవరేజీలో మొబైల్ జర్నలిజం ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ఫ్యాక్ట్ చెక్ వ్యవస్థాపకుడు రాకేష్ దుబ్బుడు డేటా ఆధారిత రిపోర్టింగ్ ప్రాముఖ్యతను వివరించారు. ఎన్నికల సమయంలో కీలక సమాచారాన్ని ఎలా రిపోర్టు చేయాలి అనే అంశంపై మొదటి సెషన్‌ను నిర్వహించారు.
యూట్యూబ్‌లో కంటెంట్ పార్ట్‌నర్‌షిప్ మేనేజర్ రవి రాజ్, యూట్యూబ్ ఫర్ న్యూస్ సెషన్‌లో ఎన్నికల సమయంలో షార్ట్ వీడియోలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరణ ఇచ్చారు. ఈ మొదటి సెషన్‌కు సంబంధించి ‘డిజిటల్ సేఫ్టీ ఫర్ జర్నలిస్ట్స్’కు డేటా అనలిస్ట్, ఫ్యాక్ట్ చెకర్, ఫ్యాక్ట్లీ & GNI-ఇండియా ట్రైనింగ్ నెట్‌వర్క్ ట్రైనర్ భరత్ గునిగంటి నాయకత్వం వహించారు. ఈ వర్క్‌షాప్‌లో మీడియా ఎడ్యుకేటర్స్, ఫ్యాక్ట్ చెకర్లు, పరిశోధకులు, జర్నలిస్టులు, డేటా నిపుణులు పాల్గొన్నారు.
భారత్‌లో జర్నలిస్టులు, మీడియా ఎడ్యుకేటర్లకు డిజిటల్ ట్రైనింగ్, అప్‌స్కేలింగ్ అవకాశాలలో సపోర్టు అందించడమే GNI ఇండియా ట్రైనింగ్ నెట్‌వర్క్ లక్ష్యంగా పెట్టుకుంది. DataLEADS నేతృత్వంలోని నెట్‌వర్క్ భారత్ అంతటా 15 కన్నా ఎక్కువ భాషలలో వేలాది మంది జర్నలిస్టులు, ఫ్యాక్ట్-చెకర్స్, మీడియా ఎడ్యుకేటర్లు, జర్నలిజం విద్యార్థులకు ట్రైనింగ్ అందించింది.