PURE EV ecoDryft: రోడ్డెక్కిన హైదరాబాదీ ప్యూర్ ఈవీ ఎలక్ట్రికల్ బైక్.. ధరెంతో తెలుసా?

PURE EV ecoDryft: రోడ్డెక్కిన హైదరాబాదీ ప్యూర్ ఈవీ ఎలక్ట్రికల్ బైక్.. ధరెంతో తెలుసా?

PURE EV launches India's most affordable electric motorcycle at Rs 99,999 with 130 km range

PURE EV ecoDryft: సుప్రసిద్ధ విద్యుత్‌ ద్విచక్ర వాహన సంస్థ ప్యూర్‌ ఈవీ కమ్యూట్‌ విద్యుత్‌ మోటర్‌ సైకిల్‌ ఎకో డ్రిఫ్ట్ (ecoDryft) ప్రారంభ ధరను 99,999 రూపాయలుగా (ఎక్స్‌ షోరూమ్‌, ఢిల్లీ, రాష్ట్ర సబ్సిడీ కలుపుకుని) నిర్ణయించింది.
ఈ మోటర్ సైకిల్ నాలుగు రంగుల్లో (బ్లాక్, గ్రే, బ్లూ, రెడ్) అందుబాటులో ఉండనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఎకోడ్రిఫ్ట్‌ను హైదరాబాద్‌లోని ప్యూర్‌ ఈవీకి చెందిన సాంకేతిక తయారీ కేంద్రంలో అభివృద్ధి చేశారు. ఇది గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఒక్కసారి చార్జింగ్‌తో మూడు డ్రైవింగ్‌ మోడ్స్‌తో 130 కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తుంది.

Adani Group: 500 మిలియన్ డాలర్ల బ్యాంకు రుణాలు చెల్లించనున్న అదానీ

ఈ డ్రైవ్‌ ట్రైన్‌లో ఏఐఎస్‌ 156 సర్టిఫైడ్‌ 3.0 కిలోవాట్‌ అవర్ బ్యాటరీ, స్మార్ట్‌ బీఎంఎస్‌తో ఉంది. దీనిలో బ్లూ టూత్‌ కనెక్టివిటీ సైతం ఉండటంతో పాటుగా 3కిలోవాట్‌ మోటర్‌, సీఏఎన్‌ ఆధారిత చార్జర్‌, కంట్రోలర్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ ఆధారిత సాధుపాయలను కలిగి ఉండడం చేత భవిష్యత్‌లో ఫర్మ్‌వేర్‌ అప్‌గ్రేడ్స్‌ సైతం అనుమతిస్తుంది. ప్యూర్‌ ఈవీ స్టార్టప్‌ సహ-వ్యవస్థాపకుడు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రోహిత్‌ వదేరా మాట్లాడుతూ “గత రెండు నెలలుగా, భారతదేశ వ్యాప్తంగా 100కు పైగా ఉన్న మా డీలర్‌షిప్‌లన్నింటిలో డెమో వాహనాలను టెస్ట్‌ డ్రైవ్‌ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చాము. వినియోగదారుల నుంచి అపూర్వమైన స్పందననూ మాకు అందుతోంది. ఎకోడ్రిఫ్ట్‌ కోసం ఆయా డీలర్ల వద్ద అడ్వాన్స్ బుకింగ్స్‌ ప్రారంభించాం. మొదటి బ్యాచ్‌లో వాహనాలను మార్చి మొదటి వారం నుంచి డెలివరీ చేస్తాం’’ అని చెప్పారు.

Russian Oil: తోక ముడిచిన అమెరికా.. రష్యా నుంచి ఇండియా చమురు కొనడంపై అభ్యంతరం లేదట

ఎకో డ్రిఫ్ట్‌ ఆవిష్కరణ యొక్క ప్రాముఖ్యత గురించి ఆయన ప్రస్తావిస్తూ ‘‘దేశంలో దాదాపు 65% ద్విచక్ర వాహన అమ్మకాలు కమ్యూటర్‌ మోటర్‌సైకిల్స్‌ నుంచి వస్తున్నాయి, ఎకో డ్రిఫ్ట్‌ ఆవిష్కరణతో భారీ శ్రేణి విద్యుత్‌ వాహన స్వీకరణ సాధ్యమవుతుందని నమ్ముతున్నాము’’ అని అన్నారు. అయితే తాజా మోటర్ సైకిల్ మీద నిర్ణయించిన ప్రారంభోత్సవ ధర (99,999 రూపాయలు) న్యూఢిల్లీకి మాత్రమే వర్తిస్తుందట. భారతదేశ వ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాలలో ఎకోడ్రిఫ్ట్‌ ధరలు 1,14,999 రూపాయలుగా (ఎక్స్‌ షోరూమ్‌) ఉండనున్నాయి. ఆన్‌ రోడ్‌ ధరలు ఆ రాష్ట్రాల రాయితీలు మరియు ఆర్‌టీఓ ఫీజులపై ఆధారపడి ఉంటాయి.