IND vs SA 2nd T20 : భారత్ జోరు కొనసాగేనా..? హార్దిక్, అర్ష్‌దీప్‌లను ఊరిస్తున్న రికార్డులు.. అందరిచూపు కెప్టెన్‌పైనే..

India vs South Africa : హార్దిక్ పాండ్య పునరాగమనంలో తొలి మ్యాచ్ లోనే చెలరేగడం భారత్ కు సంతోషాన్నిస్తోంది. కేవలం 28 బంతుల్లోనే ..

IND vs SA 2nd T20 : భారత్ జోరు కొనసాగేనా..? హార్దిక్, అర్ష్‌దీప్‌లను ఊరిస్తున్న రికార్డులు.. అందరిచూపు కెప్టెన్‌పైనే..

India vs South Africa

Updated On : December 11, 2025 / 2:24 PM IST

IND vs SA 2nd T20 : ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా రెండో టీ20 మ్యాచ్ ఇవాళ సాయంత్రం న్యూ చండీగఢ్ వేదికగా జరగనుంది. సాయంత్రం 7గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే, తొలి మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో రెండో మ్యాచ్ లో విజయం సాధించి భారత జట్టుకు గట్టి పోటీ ఇవ్వాలని సఫారీ జట్టు భావిస్తుంది. దీంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: yashasvi jaiswa : రోహిత్ భయ్యా నన్ను తిట్టాడు.. అవకాశం వస్తే నేను కెప్టెన్ అవుతా.. యశస్వీ జైస్వాల్ కీలక కామెంట్స్..

తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా టాప్ ఆర్డర్ పరుగులు రాబట్టడంలో విఫలమైంది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ్టి మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ పరుగుల వరద పారిస్తాడని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.

హార్దిక్ పాండ్య పునరాగమనంలో తొలి మ్యాచ్ లోనే చెలరేగడం భారత్ కు సంతోషాన్నిస్తోంది. కేవలం 28 బంతుల్లోనే అజేయంగా 59 పరుగులు చేసిన హార్దిక్.. రెండో టీ20 మ్యాచ్ లోనూ చెలరేగితే సఫారీ జట్టుకు ఇబ్బందులు తప్పవు. అయితే, ఈ మ్యాచ్ ద్వారా హార్దిక్ పాండ్యా సరికొత్త రికార్డును నమోదు చేసే అవకాశం ఉంది.

హార్ధిక్ పాండ్య మరో వికెట్ పడగొడితే అరుదైన క్లబ్ లో చేరుకుంటాడు. టీ20ల్లో 100 సిక్సర్లు, 100 వికెట్లు తీసిన నాలుగో ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ఇంతకుముందు సికిందర్ రజా (జింబాబ్వే), నబీ (అఫ్గానిస్తాన్), విరందీప్ సింగ్ (మలేషియా) మాత్రమే ఈ ఘనత సాధించారు.

టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ప్రస్తుతం టీ20ల్లో పవర్ ప్లేలో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అవతరించేందుకు కేవలం ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం భువనేశ్వర్ కుమార్ (47వికెట్లు)తో అర్ష్‌దీప్ సమానంగా ఉన్నాడు. ఇవాళ రెండో టీ20 మ్యాచ్ లో ఒక్క వికెట్ తీస్తే అర్ష్‌దీప్ టాప్ లోకి దూసుకెళ్తాడు.

భారత్ జట్టు (అంచనా) : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (సి), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ (WK), అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్,
దక్షిణాఫ్రికా జట్టు (అంచనా) : డికాక్, మార్‌క్రమ్, స్టబ్స్, బ్రెవిస్, మిల్లర్, డొనోవన్‌ ఫెరీరా, యాన్సెన్, సిపమ్లా, కేశవ్‌ మహరాజ్, ఎంగిడి, నోకియా.