Modi : చంద్రబాబు పాలనపై మోదీ ప్రశంసలు.. తెలంగాణలో బీజేపీ వెనుకబడిందన్న ప్రధాని..
Modi : తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక కామెంట్స్ చేశారు. గురువారం ఉదయం ఏపీ, తెలంగాణ ఎన్డీయే ఎంపీలతో..
PM Narendra Modi
Modi : తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక కామెంట్స్ చేశారు. గురువారం ఉదయం ఏపీ, తెలంగాణ ఎన్డీయే ఎంపీలతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ అల్పాహార విందులో పాల్గొన్నారు. సుమారు అరగంట పాటు వారితో మాట్లాడారు. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని రాజకీయాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యాలు చేశారు.
ఏపీలో చంద్రబాబు నాయుడు పాలన అద్భుతంగా ఉందని మోదీ ప్రశంసించారు. పెట్టుబడులు కూడా ఏపీకి ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. కూటమి నేతలు సమన్వయంతో ముందుకెళ్తున్నారు. టీడీపీతో సమన్వయం బాగుంది. చంద్రబాబు పరిపాలనపై మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చిందన్న మోదీ.. మంచి అభివృద్ధికి ఇది సూచిక అని పేర్కొన్నారు.
వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలకు బీజేపీ కూడా దీటుగా కౌంటర్ ఇవ్వాలని ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. ఇదే క్రమంలో తెలంగాణలో బీజేపీ పాత్రపై మోదీ కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
తెలంగాణలో పార్టీ మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలి. ప్రతిపక్ష పాత్రను మరింత సమర్థవంతంగా పోషించాలి. సోషల్ మీడియాలోనూ తెలంగాణలో బీజేపీ వెనుకబడింది. బీజేపీ సోషల్ మీడియా కంటే ఓవైసీ సోషల్ మీడియా బాగా పనిచేస్తోంది. సామాజిక మాధ్యమాల విషయంలో మరింత దృష్టి పెట్టాలని తెలంగాణ బీజేపీ ఎంపీలకు మోదీ సూచించారు.
