Jio vs Vi vs Airtel : జియో టు ఎయిర్‌టెల్.. రోజుకు 3GB డేటా.. టాప్ ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే..!

మీరు స్మార్ట్‌ఫోన్‌లో ఏదైనా వెబ్‌సైట్‌ లేదా సినిమాల కోసం బ్రౌజింగ్ చేస్తున్నారా? అయితే డేటా వెంటనే అయిపోతుందా? మీరు రోజుకు 2GB కంటే ఎక్కువ డేటాను పొందవచ్చు.

Jio vs Vi vs Airtel : జియో టు ఎయిర్‌టెల్.. రోజుకు 3GB డేటా.. టాప్ ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే..!

Reliance Jio Vs Vodafone Idea Vs Airtel Top Prepaid Plans Offering 3gb Data Per Day

Jio vs Vi vs Airtel : మీరు స్మార్ట్‌ఫోన్‌లో ఏదైనా వెబ్‌సైట్‌ లేదా సినిమాల కోసం బ్రౌజింగ్ చేస్తున్నారా? అయితే డేటా వెంటనే అయిపోతుందా? మీరు రోజుకు 2GB కంటే ఎక్కువ డేటాను పొందవచ్చు. మీరు కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి తెలుసుకోవాల్సిందే. దేశీయ టెలికం దిగ్గజాలైన Reliance Jio Vodafone Idea, Airtel కంపెనీలు తమ యూజర్ల కోసం రోజుకు 3GB డేటాను అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. వోడాఫోన్ ఇటీవల స్ట్రీమింగ్ యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ వంటి బెనిఫిట్స్ అందిస్తోంది. అంతేకాదు.. రోజుకు 4GB డేటాను అందించే ప్లాన్‌ను తీసుకొచ్చింది. రోజుకు 3GB డేటాను అందించే Vodafone Idea, Reliance Jio Airtel ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఓసారి చూద్దాం..

వోడాఫోన్ ఐడియా : 
వోడాఫోన్ ఐడియా రూ. 359 ప్రీపెయిడ్ ప్లాన్‌ అందిస్తోంది. రోజుకు 3GB డేటాను అందిస్తుంది. ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది, రాత్రిపూట బింగే ఫీచర్, వారాంతపు డేటా రోల్‌ఓవర్, రోజుకు 100 sms, ప్రతి నెలా 2GB వరకు బ్యాకప్ డేటాను అందిస్తోంది. ఆపై రూ. 901 ధరతో మరొక ప్లాన్ ఉంది. ఎక్కువ వ్యాలిడిటీ ఉంటుంది. ప్రీపెయిడ్ ప్లాన్ 70 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో బింజ్ ఆల్ నైట్ ఫీచర్, వారాంతపు డేటా రోల్‌ఓవర్, రోజుకు 100 sms, ప్రతి నెలా 2GB వరకు బ్యాకప్ డేటా వస్తుంది. అదనంగా, సబ్‌స్క్రైబర్‌లు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్‌కి ఏడాది వరకు యాక్సెస్‌ను పొందవచ్చు. ప్రత్యేకమైన టీవీ షోలు, సీరియల్‌లు, లైవ్ స్పోర్ట్స్, డబ్ చేసిన హాలీవుడ్ సినిమాల ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌ను యాక్సస్ చేసుకోవచ్చు.

Reliance Jio Vs Vodafone Idea Vs Airtel Top Prepaid Plans Offering 3gb Data Per Day (1)

Reliance Jio Vs Vodafone Idea Vs Airtel Top Prepaid Plans Offering 3gb Data Per Day

ఎయిర్‌టెల్ :
ఎయిర్‌టెల్ రూ. 599తో రోజుకు 3GB డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్ సబ్‌స్క్రిప్షన్ 30 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, రోజువారీగా 3GB డేటా, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ. 100 క్యాష్‌బ్యాక్ పొందవచ్చునని ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్ తెలిపింది. మీరు 3 నెలల పాటు అపోలో సబ్‌స్క్రిప్షన్, షా అకాడమీలో ఉచిత ఆన్‌లైన్ కోర్సు పొందవచ్చు. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

రిలయన్స్ జియో :
Jio అన్ లిమిటెడ్ బెనిఫిట్స్‌తో పాటు వచ్చే రూ. 419 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్‌తో యూజర్లు 3GB రోజువారీ డేటాను పొందవచ్చు. ఏ నెట్‌వర్క్‌కైనా అన్ లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. మొత్తంగా 84GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో రోజుకు 100 SMSలు వస్తాయి. 28 రోజుల పాటు వ్యాలిడిటీ వస్తుంది. JioTV, JioCinema , మరిన్ని Jio యాప్‌లకు యాక్సెస్‌ పొందవచ్చు. Jio రూ. 601, 1199, రూ. 4199 ధరలతో రోజుకు 3GB డేటాను అందించే మరో మూడు ఇతర ప్లాన్‌లను కూడా అందిస్తుంది.

Read Also : Jio, Airtel, Vi : రూ.500లోపు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాను ఇవే.. వ్యాలిడిటీ ఎంతంటే?