Property Show : రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దేశంలోనే అతి పెద్ద మార్కెట్-ఎస్‌బి‌ఐ ఎం.డీ

హైదరాబాద్ హైటెక్స్‌లో ఎస్‌బి‌ఐ ప్రాపర్టీ షో శనివారం ఘనంగా ప్రారంభమైంది. రెండురోజులపాటు జరిగే ఈ ప్రాపర్టీ షో ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాసులు శెట్

Property Show : రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దేశంలోనే అతి పెద్ద మార్కెట్-ఎస్‌బి‌ఐ ఎం.డీ

Real Estate Property show

Property Show :  రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దేశంలోనే అతి పెద్ద మార్కెట్ గా వుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాసులు శెట్టి  అన్నారు,  హైదరాబాద్ హైటెక్స్‌లో రెండురోజులపాటు జరిగే  ప్రాపర్టీ షో ని  ఆయన ఈరోజు   జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రఖ్యాతి గాంచింన సుమారు యాభై రెండు కంపెనీలు ఈ ప్రాపర్టీ షో లో పాల్గొంటున్నాయి. ఎస్‌బిఐ ప్రాపర్టీ షో లో మై హోం గ్రూప్ కంపెనీ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ ఏడాది అత్యధికంగా హోం లోన్స్ తీసుకున్న నగరాలలో హైదరాబాద్, బెంగుళూర్ నగరాలు ముందు వరుసలలో వున్నాయని ఎస్‌బిఐ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసులు శెట్టి అన్నారు. అలాగే ఈ ఏడాది ఏడువేల కోట్లకు పైగా గృహ రుణాలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. మిగతా బ్యాంక్ గృహ రుణాల వడ్డీ రేట్ల కంటే ఎస్‌బిఐ లో 6.7 శాతంతో అతి తక్కువ వడ్డీ రేట్లకే గృహ రుణాలు అందిస్తున్నామని ఆయన చెప్పారు.

గతేడాదితో పోలిస్తే పెద్ద నగరాలకు ధీటుగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలలో గృహ రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందని ఆయన అన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దేశంలోనే అతి పెద్ద మార్కెట్ గా వుందని, సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకొనే వారికి ప్రాపర్టీ షో బాగా ఉపయోగ పడుతుందని శ్రీనివాసులు శెట్టి అన్నారు.