Stock Market : లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

సెన్సెక్స్‌ ఉదయం 58,354 పాయింట్ల దగ్గర సానుకూలంగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 58,777 దగ్గర జీవనకాల గరిష్ఠానికి చేరుకుంది. చివరకు 476 పాయింట్ల లాభంతో 58,723 దగ్గర ముగిసింది. నిఫ్టీ సైత

Stock Market : లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Stock Market

Stock Market : కొన్ని రోజులుగా నెమ్మదించిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం ఊపందుకున్నాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు సమయం గడుస్తున్న కొద్దీ పైకి ఎగబాకాయి. టెలికాం రంగానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు, ఆటో రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ప్రకటించడంతో ఆయా రంగాల షేర్లు దూసుకెళ్లాయి. అల్యూమినియం ధరలు దశాబ్ద గరిష్ఠానికి చేరుకోవడంతో లోహ రంగ షేర్లు సైతం రాణించాయి. కోల్‌ ఇండియా ధరలు పెంచే అవకాశం ఉందన్న వార్తలు ఆ కంపెనీ షేర్లతో పాటు ఎన్టీపీసీ వాటాలు కూడా దాదాపు 7 శాతం ర్యాలీ అయ్యాయి.

WhatsApp Tricks : వాట్సాప్‌లో టైప్ చేయకుండానే మెసేజ్ పంపొచ్చు.. ఇదిగో ప్రాసెస్!

మరోవైపు రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గడం, వ్యాక్సినేషన్‌ ఊపందుకోవడం, మరిన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి రానుండడం, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటుండడం వంటి పరిణామాలు ఇన్వెస్టర్లలో భరోసాను నింపాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే నేడు సూచీలు పరుగులు పెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ.. సూచీలు రాణించడం విశేషం.

సెన్సెక్స్‌ ఉదయం 58,354 పాయింట్ల దగ్గర సానుకూలంగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 58,777 దగ్గర జీవనకాల గరిష్ఠానికి చేరుకుంది. చివరకు 476 పాయింట్ల లాభంతో 58,723 దగ్గర ముగిసింది. నిఫ్టీ సైతం 17,532 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకి చివరకు 139 పాయింట్లు లాభపడి 17,519 దగ్గర స్థిరపడింది. సెన్సెక్స్‌ 30 షేర్లలో 20 లాభపడ్డాయి. ఎన్‌టీపీసీ షేర్లు ఏడు శాతం రాణించాయి. ఎయిర్‌టెల్‌ షేర్లు ఐదు శాతం ఎగబాకాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో పయనించాయి.

Facebook : స్మార్ట్ గ్లాసెస్‌‌తో వీడియో, ఫొటోలు క్లిక్..రికార్డు చేయొచ్చు!

రాణించిన షేర్లు..
ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, టైటన్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌, టీసీఎస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌

నష్టపోయిన షేర్లు..
నెస్లే ఇండియా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, యాక్సిస్ బ్యాంక్‌, ఏషియన్ పెయింట్స్‌, సన్‌ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు