Fixed Deposits : ఏ బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేయాలి ?

అతిపెద్ద బ్యాంకులన్నింటిలోనూ...ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు అమాంతం పడిపోయాయి. అధిక వడ్డీ రేట్లు పథకాల్లోనే చేయడానికి చాలా మంది ప్రాధాన్యం ఇస్తున్నారు.

Fixed Deposits : ఏ బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేయాలి ?

Deposit

3 Year Fixed Deposits : ఫిక్స్ డే డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టే ముందు…ఆయా బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే..వడ్డీ రేట్లు తగ్గుముఖం పడితే..మదుపర్లకు వచ్చే రిటర్న్ తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా గ్యారంటెడ్ రిటర్న్ హామీ ఇచ్చే ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాల్లోనే పెట్టుబడులు పెడుతూ వస్తున్నారు. అతిపెద్ద బ్యాంకులన్నింటిలోనూ…ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు అమాంతం పడిపోయాయి. అయినా..కూడా..అధిక వడ్డీ రేట్లు పథకాల్లోనే చేయడానికి చాలా మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. మరోవైపు ప్రైవేటు బ్యాంకులు మూడు సంవత్సరాల ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఏడు శాతం వరకు ఆఫర్ ఇస్తున్నాయి.

Read More : WhatsApp: వాట్సప్ ప్రొఫైల్ పిక్ కనిపించకుండా హైడింగ్ ఆప్షన్

ఉజ్వల్ స్మాల్ ఫైనాన్స్ : ఈ బ్యాంకు మూడేండ్ల ఫిక్స్ డ్ డిపాజిట్లపై 6.5 శాతం వడ్డీ అందిస్తోంది. రూ. లక్ష వరకు మదుపు చేశారని అనుకుందాం.. మూడు సంవత్సరాల తర్వాత..అతని చేతికి రూ. 1.21 లక్షల రిటర్న్ వస్తాయి.
యెస్ బ్యాంకు : ఈ బ్యాంకు 6.25 శాతం వడ్డీ అందిస్తోంది. రూ. లక్ష వరకు మదుపు చేస్తే..మూడు సంవత్సరాల తర్వాత…రూ. 1.20 లక్షల రిటర్న్ వస్తాయి. ఈ బ్యాంకులో కనీస మదుపు మొత్తం రూ. 10 వేలు.
ఇండస్ ఇండ్ బ్యాంకు : ఆరు శాతం వడ్డీ అందిస్తోంది. రూ. లక్ష వరకు డిపాజిట్ చేస్తే…మూడు సంవత్సరాల తర్వాత…రూ. 1.19 లక్షల వరకు వస్తాయి. ఈ బ్యాంకులో కనీస మదుపు రూ. 10 వేలు.

Read More : Cristiano Ronaldo: రొనాల్డో ఒక్కసారి ఐస్ బాత్ కోసం రూ.51లక్షలు

సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు : మూడేండ్ల ఫిక్స్ డ్ డిపాజిట్లపై   ఏడు శాతం వడ్డీ రేటు అందిస్తోంది ఈ బ్యాంకు. లక్ష రూపాయలు ఈ బ్యాంకులో డిపాజిట్ చేస్తే..మూడేండ్ల తర్వాత…1.23 లక్షల రిటర్న్ వస్తాయి. కనీసం మాత్రం రూ. 1000 మదుపు చేయాల్సి ఉంటుంది.
ఆర్బీఎల్ బ్యాంకు : ఈ బ్యాంకు 6.30 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. రూ. లక్ష వరకు డిపాజిట్ చేస్తే..మూడు సంవత్సరాల తర్వాత..రూ. 1.21 రిటర్న్ వస్తాయి.