Toyota Kirloskar Motor : పెట్రోల్, డీజిల్, కరెంటు అక్కర్లేని కారు..త్వరలో ఇండియాలో

వాతావరణంలో లభించే హైడ్రోజన్ గ్యాస్ వాడడం వల్ల కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణం కాపాడే అవకాశం ఉంది. ఇది అందుబాటులోకి వస్తే.. పెట్రోల్, గ్యాస్ వాడకాన్ని బాగా తగ్గించవచ్చు. వాహనాల్లో..

Toyota Kirloskar Motor : పెట్రోల్, డీజిల్, కరెంటు అక్కర్లేని కారు..త్వరలో ఇండియాలో

Gadkari

Union Minister Nitin Gadkari : పెట్రోల్, డీజిల్, కరెంటు అవసరం లేకుండా వాహనాలు రోడ్ల మీదకు రానున్నాయి. త్వరలోనే ఇండియా రోడ్లపై ఇవి దూసుకపోనున్నాయి. అలా ఎలా సాధ్యమని అనుకుటున్నారా ? ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్, కరెంటుతో కూడిన వాహనాలు రోడ్ల మీద పరుగులు పెడుతున్నాయి. త్వరలోనే హైడ్రోజన్ కార్లు తిరిగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రైవేటు లిమిటెడ్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT) భారతీయ రోడ్లు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నడిచే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ టయోటా మిరాయ్ కారును పరీక్షించనున్నారు. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి ఈ పైలట్ ప్రాజెక్టును 2022, మార్చి 16వ తేదీ బుధవారం ప్రారంభించనున్నారు.

Read More : Xiaomi 12 Series : 120W ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో షావోమీ 12 సిరీస్.. ధర ఎంతంటే?

వాతావరణంలో లభించే హైడ్రోజన్ గ్యాస్ వాడడం వల్ల కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణం కాపాడే అవకాశం ఉంది. ఇది అందుబాటులోకి వస్తే.. పెట్రోల్, గ్యాస్ వాడకాన్ని బాగా తగ్గించవచ్చు. వాహనాల్లో ఎలాగైతే ఇంధనం నింపుతామో…అదే విధంగా హైడ్రోజన్ ను కారులో నింపవచ్చు. భారతదేశ ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ పైలట్ ప్రాజెక్టు దేశ రాజధాని ఢిల్లీలో గతంలోనే ప్రారంభించారు. భారతీయ రోడ్లు, వాతావరణ పరిస్థితులపై ఈ పైలట్ ప్రాజెక్టు అధ్యయనం నిర్వహిస్తుంది. టయోటా కంపెనీకి చెందిన మిరాయ్ కారులో హైడ్రోజన్ ఫ్యూయల్ ని ఫుల్ ట్యాంక్ చేసి 1,359 కిలో మీటర్ల దూరం ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఈ మొత్తం ప్రయాణించడానికి 5.65 కిలోగ్రాముల హైడ్రోజన్ ను వినియోగించింది.