Vivo V29 Series Launch : కళ్లు చెదిరే ఫీచర్లతో వివో V29 5G సిరీస్ వచ్చేస్తోంది.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?

Vivo V29 Series Launch : కొత్త వివో ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మరికొద్ది రోజుల్లో భారత మార్కెట్లో వివో నుంచి V29 సిరీస్ లాంచ్ కానుంది. అద్భుతమైన ఫీచర్లతో అక్టోబర్ 4న ఇండియా-ఎక్స్‌క్లూజివ్ ప్రొడక్ట్‌గా రానుంది.

Vivo V29 Series Launch : కళ్లు చెదిరే ఫీచర్లతో వివో V29 5G సిరీస్ వచ్చేస్తోంది.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?

Vivo V29 Series Set to Launch in India on October 4_ What We Know So Far

Vivo V29 Series Launch : వివో అభిమానులకు అదిరే న్యూస్.. ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో (Vivo) నుంచి సరికొత్త మోడల్ (Vivo V29 Series) సిరీస్ వచ్చేస్తోంది. వచ్చే వారం భారత మార్కెట్లో వివో V29 సిరీస్ మోడల్ లాంచ్ కానుంది. వివో V29 5G బేస్ మోడల్ ఈ ఏడాది ప్రారంభంలో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది.

ఇప్పుడు, భారత మార్కెట్లో ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. అదనపు ప్రో మోడల్‌తో పాటు గ్లోబల్ వేరియంట్‌తో సమానమైన స్పెసిఫికేషన్‌లతో రానుందని భావిస్తున్నారు. వివో 29 ప్రో 5G మోడల్ అక్టోబర్ 4న ఇండియా-ఎక్స్‌క్లూజివ్ ప్రొడక్ట్‌గా లాంచ్ అవుతుందని నివేదిక తెలిపింది. ఈ ఫోన్‌లు ఇండియా-స్పెసిఫిక్ ఫీచర్‌లతో లాంచ్ అవుతాయని సమాచారం. గతంలో హ్యాండ్‌సెట్ డిజైన్, కీలక వివరాలను కంపెనీ టీజ్ చేసింది.

Read Also :  Google Pixel 8 Series : గూగుల్ పిక్సెల్ 8 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫుల్ ఫీచర్లు లీక్, ధర ఎంతో తెలిసిందోచ్..!

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా సేల్ :
వివో కంపెనీ లైనప్ బేస్ Vivo V29, V29 ప్రో మోడల్‌లతో వస్తుందని భావిస్తున్నారు. సరికొత్త V29 సిరీస్ ఫోన్‌లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఛానెల్‌ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటాయని కంపెనీ ధృవీకరించింది. ముఖ్యంగా, అదే రోజున మేడ్ బై గూగుల్ ఈవెంట్‌ (Made By Google)లో గూగుల్ పిక్సెల్ 8 సిరీస్‌తో పాటు ఇతర ప్రొడక్టులను కూడా లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది.

ప్రాథమిక వివో V29 మోడల్ గ్లోబల్ వెరైటీ మాదిరిగానే 6.78-అంగుళాల ఫుల్-HD+ (2800 x 1260 పిక్సెల్‌లు) కర్వడ్ AMOLED స్క్రీన్‌ను 120Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంటుందని అంచనా. Adreno 642L GPU, 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో కూడిన Qualcomm Snapdragon 778G SoC ఫోన్‌కు పవర్ అందిస్తుందని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్ 13-ఆధారిత (FuntouchOS) 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్ రన్ అవుతుందని భావిస్తున్నారు.

Vivo V29 Series Launch in India

Vivo V29 Series Launch in India

వివో V29 కెమెరా ఫీచర్లు (అంచనా) :
కెమెరా విభాగంలో.. ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో 8MP సెన్సార్, వెనుకవైపు స్మార్ట్ ఆరా లైట్, 50MP సెన్సార్‌తో పాటు 2MP కెమెరా ఉన్నట్లు నిర్ధారించింది. సెల్ఫీలు, వీడియో కాల్ చేసేందుకు ముందు భాగంలో.. బేస్ హ్యాండ్‌సెట్‌లో సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ IP68 రేటింగ్ ఉంటుంది.

80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 4,600mAh బ్యాటరీ ఫోన్‌లో అందిస్తుంది. వివో V29 మోడల్‌లు హిమాలయన్ బ్లూ, మెజెస్టిక్ రెడ్, స్పేస్ బ్లాక్ అనే 3 కలర్ ఆప్షన్‌లలో రానుంది. అయితే, రెడ్ కలర్ వేరియంట్‌లో మాత్రం రంగులు మారుతున్న బ్యాక్ ప్యానెల్ ఉంటుంది. బేస్, ప్రో మోడల్‌లు వరుసగా 186, 188 గ్రాముల బరువు, 7.46 మి.మీ మందం కలిగి ఉంటాయని అంచనా.

Read Also : Tech Tips in Telugu : ChatGPT ఇప్పుడు మాట్లాడగలదు.. వినగలదు.. చూడగలదు.. ఈ కొత్త ఏఐ వాయిస్, ఇమేజ్ ఫీచర్లు ఎలా పనిచేస్తాయంటే?