Jharkhand: తోటి ఖైదీని చంపిన 15 మంది ఖైదీలకు ఉరిశిక్ష

ఇదే కేసులో ఐపీసీ సెక్షన్ 307(హత్యాయత్నం) కింద పదేళ్ల పాటు జైలుశిక్ష విధిస్తుట్లు తీర్పు చెప్పారు. అయితే ఉరిశిక్ష పడ్డ ఖైదీల్లో ఇద్దరు పరారీలో ఉన్నారు. కాగా, తప్పించుకుపోయిన ఇద్దరు ఖైదీలను పట్టుకుని కోర్టు ముందు హాజరు పర్చాలని జార్ఖండ్ డీజీపీని కోర్టు ఆదేశించింది. 2019 జూన్ 25న జైలులో రెండు గ్రూపులకు మధ్య తగాదా ఏర్పడింది. ఇరు గ్రూపులు ఒకరికొకరు కుమ్ములాటకు దిగారు

Jharkhand: తోటి ఖైదీని చంపిన 15 మంది ఖైదీలకు ఉరిశిక్ష

15 people sentenced to death for killing jail inmate

Jharkhand: తోటి ఖైదీని హత్య చేసిన కేసులో 15 మంది ఖైదీలకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు జార్ఖండ్‭లోని తూర్పు సింగ్భుమ్ జిల్లా కోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఘంఘిడి సెంట్రల్ జైలులో మూడేళ్ల క్రితం రెండు గ్రూపుల మధ్య జరిగిన గోడవలో ఒక ఖైదీ మరణించాడు. కాగా, ఈ కేసు మూడేళ్లుగా కోర్టులో కొనసాగుతోంది. తాజాగా సింగ్భుమ్ జిల్లా కోర్టు విచారణ చేపట్టి ఎట్టకేలకు తీర్పు వెలువరించింది. తీర్పు సమయంలో జిల్లా కోర్టు జడ్జి రాజేంద్ర కుమార్ సిన్హా మాట్లాడుతూ ఐపీసీ సెక్షన్ 302 (హత్యానేరం), 120బీ(నేరచర్యలకు కుట్ర) ప్రకారం 15 మందికి ఉరిశిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు.

ఇదే కేసులో ఐపీసీ సెక్షన్ 307(హత్యాయత్నం) కింద పదేళ్ల పాటు జైలుశిక్ష విధిస్తుట్లు తీర్పు చెప్పారు. అయితే ఉరిశిక్ష పడ్డ ఖైదీల్లో ఇద్దరు పరారీలో ఉన్నారు. కాగా, తప్పించుకుపోయిన ఇద్దరు ఖైదీలను పట్టుకుని కోర్టు ముందు హాజరు పర్చాలని జార్ఖండ్ డీజీపీని కోర్టు ఆదేశించింది. 2019 జూన్ 25న జైలులో రెండు గ్రూపులకు మధ్య తగాదా ఏర్పడింది. ఇరు గ్రూపులు ఒకరికొకరు కుమ్ములాటకు దిగారు. ఈ గొడవలో మనోజ్ కుమార్ సింగ్ సహా మరొక ఖైదీ గాయపడ్డారు. అయితే తీవ్రంగా గాయపడ్డ మనోజ్‭ను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారి మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయమై పర్సుడి పోలీస్ స్టేషన్‭లో కేసు నమోదైంది.

Kerala: అదాని ప్రాజెక్టుపై మత్స్యకారుల ఆగ్రహం.. ఉద్రిక్తత