J&Ks Poonch: జమ్మూలో లోయలో పడ్డ బస్సు.. 12 మంది మృతి.. 25 మందికి గాయాలు

జమ్ము-కాశ్మీర్, పూంఛ్ జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. ఒక బస్సు లోయలో పడిపోవడంతో 12 మంది ప్రయాణికులు మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

J&Ks Poonch: జమ్మూలో లోయలో పడ్డ బస్సు.. 12 మంది మృతి.. 25 మందికి గాయాలు

J&Ks Poonch: జమ్ము-కాశ్మీర్, పూంఛ్ జిల్లాలో దారుణం జరిగింది. బస్సు లోయలో పడిపోవడంతో 12 మంది మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం ఉదయం బరేలి నల్లా ప్రాంతంలో జరిగింది.

Congress Collapses In Goa: గోవాలో కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీజేపీలో చేరిన 8 మంది ఎమ్మెల్యేలు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 38 మంది ప్రయాణికులతో కూడిన బస్సు సాజియాన్ నుంచి మండి వెళ్తోంది. ఈ క్రమంలో అదుపుతప్పి బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. మరో 25 మంది వరకు గాయపడ్డారు. బస్సులోని ప్రయాణికుల్లో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ఆరుగురిని చికిత్స కోసం హెలికాప్టర్ ద్వారా జమ్ము తరలించారు.

YS Sharmila: నన్ను ఎదుర్కొనే దమ్ము టీఆర్ఎస్ నేతలకు లేదు: షర్మిల

ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేలు పరిహారంగా అందించనున్నట్లు ప్రధాని ప్రకటించారు. మరోవైపు మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించనున్నట్లు జమ్ము-కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రకటించారు.