Mexico: మెక్సికోలో హెలికాప్టర్ కూలి.. 14 మంది మృతి

రాఫెల్ కారో క్వింటెరో అనే డ్రగ్స్ వ్యాపారిని నేవీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. రాఫెల్ దేశంలో అతిపెద్ద డ్రగ్స్ వ్యాపారి. గాదాలజారా కార్టెల్ అనే పెద్ద డ్రగ్స్ నిర్వహణ సంస్థను నడిపిస్తున్నాడు.

Mexico: మెక్సికోలో హెలికాప్టర్ కూలి.. 14 మంది మృతి

Mexico

Mexico: మెక్సికోలో మిలిటరీ హెలికాప్టర్ కూలిన ఘటనలో 14 మంది మరణించినట్లు అక్కడి నేవీ తెలిపింది. సినాలోవా రాష్ట్రంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. అయితే, ఈ ఘటన అనేక అనుమానాలకు తావిస్తోంది. కారణం అదే రోజు అక్కడి అధికారులు మెక్సికోలోని ఒక ప్రముఖ డ్రగ్ డీలర్‌ను అరెస్ట్ చేయడమే.

Inflation: ద్రవ్యోల్బణం.. తెలంగాణలోనే ఎక్కువ

రాఫెల్ కారో క్వింటెరో అనే డ్రగ్స్ వ్యాపారిని నేవీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. రాఫెల్ దేశంలో అతిపెద్ద డ్రగ్స్ వ్యాపారి. గాదాలజారా కార్టెల్ అనే పెద్ద డ్రగ్స్ నిర్వహణ సంస్థను నడిపిస్తున్నాడు. అమెరికాకు చెందిన ఒక యాంటీ నార్కొటిక్స్ ఏజెంట్‌తోపాటు, పలువురి హత్యతో రాఫెల్‌కు సంబంధం ఉంది. ఒక హత్య కేసులో 18 ఏళ్లు జైల్లో శిక్ష కూడా అనుభవించాడు. అయితే, తమ దేశ పౌరుడిని హత్య చేయడంతోపాటు, పలు రకాల అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నఅతడిని అరెస్టు చేయాలని అమెరికా చాలా రోజుల నుంచి కోరుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికా, మెక్సికోపై ఒత్తిడి తెచ్చింది. దీంతో తిరిగి రాఫెల్‌ను శుక్రవారం నేవీ అరెస్టు చేసింది.

India-China: సరిహద్దు వివాదం.. రేపు ఇండియా- చైనా చర్చలు

అయితే, రాఫెల్‌ను అరెస్టు చేసిన కొంతసేపటి తర్వాత నేవీకి చెందిన హెలికాప్టర్ కూలిపోయింది. దీంతో ఈ ఘటనకు, రాఫెల్‌ అరెస్టుకు ఏమైనా సంబంధం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ ఘటనలో 14 మంది మరణించగా, ఒకరు గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని, దీనిపై విచారణ జరుపుతున్నామని మెక్సికో అధికారులు తెలిపారు.