Crime News: రూ.10 వేల అప్పు తిరిగి చెల్లించలేదని.. ఇద్దరు అక్కాచెల్లెళ్లను కాల్చి చంపిన వడ్డీ వ్యాపారి, అతడి అనుచరులు

మృతుల పేర్లు పింకి (30), జ్యోతి (29) అని పోలీసులు తెలిపారు.

Crime News: రూ.10 వేల అప్పు తిరిగి చెల్లించలేదని.. ఇద్దరు అక్కాచెల్లెళ్లను కాల్చి చంపిన వడ్డీ వ్యాపారి, అతడి అనుచరులు

Crime News (Representative image)

Crime News – Delhi: ఢిల్లీకి చెందిన లలిత్ అనే వ్యక్తి.. ఓ వడ్డీ వ్యాపారి వద్ద రూ.10 వేలు అప్పుగా తీసుకున్నాడు. తిరిగి ఇవ్వకుండా తిరుగుతుండడంతో అతడి కోసం వడ్డీ వ్యాపారి, అతడి అనుచరులు ఆగ్రహంతో ఉన్నారు.

లలిత్ ఇంటికి ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు దాదాపు 15 నుంచి 20 మందిని వెంట పెట్టుకుని వచ్చాడు వడ్డీ వ్యాపారి. వారంతా కలిసి తలుపు కొట్టారు. లలిత్ తలుపు ఎంతకీ తెరవకపోవడంతో రాళ్లు రువ్వారు. చివరకు తలుపు తెరవట్లేదని వడ్డీ వ్యాపారి, అతడి అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చేశారు.

ఆ తర్వాత లలిత్ అతడి ఇద్దరి సోదరీమణులు తలుపు తీసి బయటకు వచ్చారు. అదే సమయానికి వడ్డీ వ్యాపారి, అతడి అనుచరులు అక్కడకు తిరిగి వచ్చి కాల్పులు జరిపారు. దీంతో లలిత్ ఇద్దరు సోదరీమణులకు బుల్లెట్లు తగిలాయి. ఆసుపత్రికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు చెప్పారు.

ఈ ఘటన ఢిల్లీలోని ఆర్కే పురం అంబేద్కర్ బస్తీలో జరిగింది. మృతుల పేర్లు పింకి (30), జ్యోతి (29) అని పోలీసులు తెలిపారు. వారి ఛాతీ, కడుపులో బుల్లెట్లు దిగాయని వైద్యులు వివరించారు. లలిత్ కు బుల్లెట్ తగిలినా ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానిక వడ్డీ వ్యాపారి దేవ్ తో తనకు నగదు విషయంలో వివాదం ఉందని లలిత్ చెప్పాడు. నిందితులు అర్జున్, దేవ్, మైఖేల్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

Narendra Modi: మోదీకి ప్రైవేట్ డిన్నర్ కూడా ఇవ్వనున్న జో బైడెన్!