Hyderabad Drug Case : హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. జాబితాలో ప్రముఖులు, వారి పిల్లలు
ఇటీవల ముంబై డ్రగ్స్ ముఠాలను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దాడుల్లో భారీగా డ్రగ్స్ సీజ్ చేశారు. ముంబై నుంచి దేశవ్యాప్తంగా నైజీరియన్స్, జ్యూడ్, టోనీ సరఫరా చేస్తున్నట్లు తేలింది.

Drugs
Hyderabad Drug Case : హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. డ్రగ్స్ కేసులో పోలీసులు సీరియస్ గా చర్యలు తీసుకుంటున్నారు. డ్రగ్స్ వినియోగదారులపై చర్యలకు సిద్ధపడుతున్నారు. సెక్షన్ 27 ప్రకారం కేసులు నమోదు చేసిన పోలీసులు… డ్రగ్స్ వినియోగిస్తున్న వారిలో 30 మంది ప్రముఖులను గుర్తించారు. ఈ జాబితాలో అన్ని రంగాల ప్రముఖులు, వారి పిల్లలు ఉన్నారు.
ఇక వారంతా చాలా కాలంగా డ్రగ్స్ వాడుతున్నట్లుగా గుర్తించారు. ఇటీవల ముంబైకు చెందిన డ్రగ్స్ ముఠాలను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడుల్లో భారీగా డ్రగ్స్ ను సీజ్ చేశారు. ముంబై నుంచి దేశవ్యాప్తంగా పలు నగరాలకు నైజీరియన్స్, జ్యూడ్, టోనీ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలింది.