Mumbai: ఫేక్ లింక్స్‌పై క్లిక్ చేసిన బ్యాంక్ కస్టమర్లు.. 40 అకౌంట్ల నుంచి లక్షలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు

కేవైసీ అప్డేట్, పాన్ కార్డ్ అప్డేట్, ఆధార్ అప్డేట్, ఫ్రీ గిఫ్టులు అంటూ వచ్చే లింక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది తెలియకుండా అలాంటి లింక్స్‌పై క్లిక్ చేశారో.. యూజర్ల అకౌంట్స్‌లోని డబ్బంతా మాయం కావడం ఖాయం. తాజాగా ముంబైలో 40 మంది బ్యాంక్ కస్టమర్లు ఇలాగే డబ్బులు పోగొట్టుకున్నారు.

Mumbai: ఫేక్ లింక్స్‌పై క్లిక్ చేసిన బ్యాంక్ కస్టమర్లు.. 40 అకౌంట్ల నుంచి లక్షలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు

Mumbai: మొబైల్ ఫోన్‌కు వచ్చే ఫేక్ మెసేజ్‌లు, లింక్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎంతగా ప్రచారం జరుగుతున్నా కొందరు మారడం లేదు. ముఖ్యంగా కేవైసీ అప్డేట్, పాన్ కార్డ్ అప్డేట్, ఆధార్ అప్డేట్, ఫ్రీ గిఫ్టులు అంటూ వచ్చే లింక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Manish Sisodia: జైల్లో సిసోడియాకు వేధింపులు.. బెదిరించి సంతకాలు తీసుకుంటున్నారు.. సీబీఐపై ఆప్ ఆరోపణ

ఇది తెలియకుండా అలాంటి లింక్స్‌పై క్లిక్ చేశారో.. యూజర్ల అకౌంట్స్‌లోని డబ్బంతా మాయం కావడం ఖాయం. తాజాగా ముంబైలో 40 మంది బ్యాంక్ కస్టమర్లు ఇలాగే డబ్బులు పోగొట్టుకున్నారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని ఒక ప్రైవేటు బ్యాంకుకు చెందిన కస్టమర్లకు ఇటీవల కొన్ని మెసేజెస్ వచ్చాయి. బ్యాంక్ సేవలు కొనసాగాలంటే కేవైసీలో భాగంగా పాన్, ఆధార్ వంటివి అప్డేట్ చేసుకోవాలని ఆ మెసేజ్ సారాంశం. దీంతో కొందరు యూజర్లు ఇది నిజమని నమ్మారు. కేవైసీ కోసం ఆ మెసేజ్‌లతో వచ్చిన లింక్స్‌పై క్లిక్ చేశారు.

Right To Pee: నాగ్‌పూర్‌లో పబ్లిక్ టాయిలెట్ల కోసం మహిళల ఉద్యమం.. ప్లకార్డులతో నిరసన

ఇవి ఫేక్ వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్లాయి. అక్కడ కస్టమర్లు వారి బ్యాంక్ డీటైల్స్ ఎంటర్ చేశారు. దీంతో వారి అకౌంట్స్ సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోయాయి. అలా మూడు రోజుల్లో ఏకంగా 40 మంది కస్టమర్లు ఫేక్ లింక్స్‌పై క్లిక్ చేసి మోసపోయారు. వాళ్ల అకౌంట్ల నుంచి లక్షల రూపాయల్ని సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. దీంతో బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాటిని పరిశీలించిన పోలీసులు బాధితులంతా ఒకే ప్రైవేటు బ్యాంకుకు చెందిన వారిగా గుర్తించారు. మోసపోయిన వారిలో సీరియల్ నటి శ్వేతా మీనన్ కూడా ఉన్నారు.

ఆమె అకౌంట్ నుంచి రూ.47,636 రూపాయల్ని సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇలాంటి లింక్స్‌పై క్లిక్ చేయవద్దని పౌరులను పోలీసులు హెచ్చరిస్తున్నారు.