Right To Pee: నాగ్‌పూర్‌లో పబ్లిక్ టాయిలెట్ల కోసం మహిళల ఉద్యమం.. ప్లకార్డులతో నిరసన

నాగ్‌పూర్‌లో కూడా పబ్లిక్ టాయిలెట్ల సంఖ్య చాలా తక్కువ. దీంతో అక్కడ పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలంటూ మహిళలు ఉద్యమించారు. నాగ్‌పూర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన చేపట్టారు. ‘రైట్ టు పీ’ పేరుతో ప్లకార్డులు చేతబట్టుకుని మహిళలు నిరసన వ్యక్తం చేశారు.

Right To Pee: నాగ్‌పూర్‌లో పబ్లిక్ టాయిలెట్ల కోసం మహిళల ఉద్యమం.. ప్లకార్డులతో నిరసన

Right To Pee: పేరుకే పెద్ద నగరాలు. కానీ, కనీసం పబ్లిక్ టాయిలెట్లు కూడా ఉండవు. దీంతో ఏదైనా పని మీద బయటకు వెళ్లిన వాళ్లు మల, మూత్ర విసర్జన కోసం చాలా ఇబ్బందులు పడతారు. మగవాళ్లంటే పర్లేదు.. ఎక్కడో చోట విసర్జన కానిచ్చేస్తారు. కానీ, మహిళలకు ఆ అవకాశం లేదు.

Manish Sisodia: జైల్లో సిసోడియాకు వేధింపులు.. బెదిరించి సంతకాలు తీసుకుంటున్నారు.. సీబీఐపై ఆప్ ఆరోపణ

అనేక చోట్ల పబ్లిక్ టాయిలెట్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి నగరాల్లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ఒకటి. అక్కడ కూడా పబ్లిక్ టాయిలెట్ల సంఖ్య చాలా తక్కువ. దీంతో అక్కడ పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలంటూ మహిళలు ఉద్యమించారు. నాగ్‌పూర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన చేపట్టారు. ‘రైట్ టు పీ’ పేరుతో ప్లకార్డులు చేతబట్టుకుని మహిళలు నిరసన వ్యక్తం చేశారు. నగరవ్యాప్తంగా మహిళల కోసం సురక్షితమైన, శుభ్రమైన టాయిలెట్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 30, 2021న నాగ్‌పూర్ సిటిజన్స్ ఫోరం సంస్థ ‘రైట్ టు పీ’ అనే ఉద్యమాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి తరచూ టాయిలెట్ల కోసం ఉద్యమిస్తోంది.

Gold Bars: విమానం టాయిలెట్‌లో రూ.2 కోట్ల విలువైన బంగారు ఇటుకలు.. స్వాధీనం చేసుకున్న అధికారులు

నగరంలో ఉచితంగా శుభ్రమైన, సురక్షితమైన టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ఈ సంస్థ డిమాండ్ చేస్తోంది. తాజా నిరసనల్లో భాగంగా నగరవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ టాయిలెట్లను సంస్థ పరిశీలించింది. పబ్లిక్ టాయిలెట్లు లేకపోవడం వల్ల మహిళలు వేరే ప్రైవేటు టాయిలెట్లు వాడుకోవాల్సి వస్తోందని, ఇది మహిళలపై నేరాలు పెరగడానికి కారణమవుతోందని ఈ నిరసనల్లో పాల్గొన్న మహిళలు అంటున్నారు. ఈ నిరసనల్లో అనేక మంది యువతులు, మహిళా లాయర్లు, నేతలు పాల్గొన్నారు. ఈ ఉద్యమానికి కొందరు పురుషులు కూడా మద్దతు పలికారు.