Uttar Pradesh Road Accident : ఉత్తరప్రదేశ్ లో ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఆరుగురు దుర్మరణం

తీవ్రంగా గాయపడిన ముగ్గురిలో ఒకరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చికిత్స పొందుతూ మరణించారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Uttar Pradesh Road Accident : ఉత్తరప్రదేశ్ లో ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఆరుగురు దుర్మరణం

Road Accident (8)

Updated On : June 30, 2023 / 7:44 AM IST

Car Collides With Truck : ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. బాండా జిల్లాలో కారు ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.  మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

తీవ్రంగా గాయపడిన ముగ్గురిలో ఒకరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చికిత్స పొందుతూ మరణించారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని  మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు బాండా డీఎం దుర్గాశక్తి నాగపాల్ తెలిపారు.

Mumbai Local Train : ముంబయి లోకల్ రైలులో మహిళపై లైంగిక వేధింపులు

బాండాలో అతివేగంతో వస్తున్న కారు ట్రక్కును ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారని, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. 8 మంది వ్యక్తులతో అతివేగంగా వస్తున్న కారు ట్రక్కును ఢీకొట్టిందని వెల్లడించారు.