Pimpri-Chinchwad Police : బ్యాంకు అకౌంట్ హ్యాక్..రూ. 38 లక్షలు మాయం

ఓ సీనియర్ సిటిజన్ ఖాతాలో ఉన్న రూ. 38 లక్షలకు పైగా డబ్బును గుర్తు తెలియని వ్యక్తులు కాజేశారు. వాకాడ్ పోలీసులకు అతను ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుల కోసం..ఆరా తీస్తున్నారు. 61 సంవత్సరాలున్న ఓ వ్యక్తి కలెవాడి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.

Pimpri-Chinchwad Police : బ్యాంకు అకౌంట్ హ్యాక్..రూ. 38 లక్షలు మాయం

Bank Account

Bank Account Hacked : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును కాజేస్తున్నారు. తమ బ్యాంకు అకౌంట్లో ఉన్న డబ్బు ఎలా మాయం అవుతుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. తాజాగా ఓ సీనియర్ సిటిజన్ ఖాతాలో ఉన్న రూ. 38 లక్షలకు పైగా డబ్బును గుర్తు తెలియని వ్యక్తులు కాజేశారు. వాకాడ్ పోలీసులకు అతను ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుల కోసం..ఆరా తీస్తున్నారు. 61 సంవత్సరాలున్న ఓ వ్యక్తి కలెవాడి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.

Read More : Eatala-Gangula : హత్యా రాజకీయాలపై ఈటల, గంగుల మాటల యుధ్ధం

ఇతను వ్యాపారాలకు సలహాలు ఇస్తుంటారు. ఓ ప్రైవేటు బ్యాంకులో ఇతనికి ఖాతా ఉంది. జూలై 15వ తేదీన బాధితుడి సెల్ కు ఓ ఫోన్ మేసెజ్ వచ్చిందని, అతని ఖాతాలో రూ. 2 లక్షలకు పైగా నగదు కట్ చేయబడిందంటూ..ఆ మేసేజ్ లో ఉందని వకాడ్ పీఎస్ అధికారి వెల్లడించారు. వెంటనే ఈ విషయాన్ని బ్యాంకు అధికారులకు బాధితుడు తెలియచేశారని, ఎనిమిది లావాదేవీలకు సంబంధించి తన ఖాతా నుంచి రూ. 38.04 లక్షలు డ్రా అయినట్లు బాధితుడు తెలియచేశారన్నారు.

Read More : Congress On Pegasus Spyware : అమిత్ షా రాజీనామా చేయాలి..మోదీపై విచారణ జరగాలి

ఎలా జరిగిందో తాము పరిశీలించడం జరుగుతోందని, బదిలీ చేయబడిన ఖాతాలపై కూడా దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. సైబర్ మోసాల బాధితుల కోసం పూణే సిటీ పోలీసులు రెండు హెల్ప్ లైన్ నెంబర్లను ప్రారంభించారు.