Road Accident: యమునా ఎక్స్‌ప్రెస్ వే పై ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు దుర్మరణం

కారు మరొక వాహనాన్ని ఢీకొన్న ఘటనలో కారులో ఉన్న తొమ్మిది మందిలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు.

Road Accident: యమునా ఎక్స్‌ప్రెస్ వే పై ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు దుర్మరణం

Road

Updated On : May 7, 2022 / 1:29 PM IST

Road Accident: దేశ రాజధాని ఢిల్లీ సరిహాద్దులో యమునా ఎక్స్‌ప్రెస్ వేపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు మరొక వాహనాన్ని ఢీకొన్న ఘటనలో కారులో ఉన్న తొమ్మిది మందిలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒక చిన్నారి సహా ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నొయిడాకు చెందిన తొమ్మిది మంది కుటుంబ సభ్యులు..వాగానోర్ కారులో యమునా ఎక్స్‌ప్రెస్ వే పై ఆగ్రా వైపు నుంచి నోయిడా వైపుకే వెళ్తుండగా..మార్గమధ్యలో నౌజీల్ వద్ద మరో వాహనాన్ని ఢీకొట్టింది.

Also Read:Coronavirus: దేశంలో పెరిగిన కొత్త కొవిడ్ కేసులు.. 20వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య

కారు వేగంగా ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగి..కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఘటనపై వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి..వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా ఆ వివాహ వేడుకలో పాల్గొనేందుకు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల వివరాలు సేకరించి బాధిత కుటుంబాలకు సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

Also Read:Indore fire incident: మధ్యప్రదేశ్ ఇండోర్‌లో అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవదహనం..