Coronavirus: దేశంలో పెరిగిన కొత్త కొవిడ్ కేసులు.. 20వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య

రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కొవిడ్ భారిన పడి కోట్లాది మంది మృతిచెందుతున్నారు. చైనా, దక్షిణాఫ్రికా, తదితర దేశాలు మినహా ప్రపంచంలో కొవిడ్ తీవ్రత ఇటీవలికాలంలో తగ్గుకుంటూ వస్తుంది. భారత్ లోనూ..

Coronavirus: దేశంలో పెరిగిన కొత్త కొవిడ్ కేసులు.. 20వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య

Corona Virus

Coronavirus: రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కొవిడ్ భారిన పడి కోట్లాది మంది మృతిచెందుతున్నారు. చైనా, దక్షిణాఫ్రికా, తదితర దేశాలు మినహా ప్రపంచంలో కొవిడ్ తీవ్రత ఇటీవలికాలంలో తగ్గుకుంటూ వస్తుంది. భారత్ లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత వారం రోజులుగా మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా పాజిటివ్ కేసుల సంఖ్య 4వేల చేరువులోకి వెళ్లాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 3,805 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24గంటల్లో కొవిడ్ బారిన పడి 22 మంది మృతి చెందారు.

India Corona: దేశంలో స్వల్పంగా పెరిగిన కొవిడ్ కేసులు.. 55 మంది మృతి..

ఇక దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20,203కు చేరింది. దేశంలో 0.05 శాతంగా యాక్టి కేసులు ఉన్నాయి. మరోవైపు దేశంలో ఇప్పటి 4,30,98,643 కేసులు నమోదుకాగా, 5,24,024 మరణాలు నమోదయ్యాయి. దేశంలో కొవిడ్ బాధితుల రికవరీ రేటు 98.74శాతంగా ఉంది. గడిచిన 24గంటల్లో 3,618 మంది కొవిడ్ వ్యాప్తి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 4,25,54,416కు చేరుకుంది. మరోవైపు దేశంలో 477రోజులుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 19కోట్ల డోసుల టీకాలు అందజేశారు. శుక్రవారం ఒక్కరోజు దేశంలో 17,49,063 డోసుల టీకాలను వైద్య సిబ్బంది అందజేశారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 19,00,094,982 డోసుల టీకాలు అందజేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Corona Next Season: మరోసారి కరోనా వ్యాప్తి తప్పదు: ఇజ్రాయెల్ పరిశోధకులు

ఇదిలా ఉంటే తమిళనాడులోని మద్రాస్ ఇన్సిట్యూట్ తర్వాత మరొక విద్యా సంస్థలో కొవిడ్-19 కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మెడికల్ కాలేజీ హాస్టల్ లో భారీగా కేసులు నమోదయ్యాయి. చెంగల్ పట్టు జిల్లాలోని తిరుప్పోరూరు సమీపం నెల్లికుప్పంలోని సత్యసాయి వైద్య కళాశాలలో 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటిగా నమోదైంది. బాధితులు 25 మందిలో 10 మంది బాలుర హాస్టల్ లో, ఎనిమిది మంది బాలికల హాస్టల్ లో ఉన్నారు. వీరిని ఐసోలేషన్ కు పంపారు.